గలగలా గోదారి..

గలగలా గోదారి..

ధవళేశ్వరం :

కాటన్‌ బ్యారేజ్‌ వద్ద మంగళవారం సాయంత్రం గోదావరి ఉధృతి స్వల్పంగా పెరిగింది. దీంతో మిగులు జలాల విడుదలను పెంచారు. బ్యారేజ్‌ వద్ద 6.50 అడుగుల నీటిమట్టం ఉండగా 3,24,806 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. మరోపక్క ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు భద్రాచలం వద్ద 37.80 అడుగులకు చేరుకున్న నీటిమట్టం సాయంత్రం 6 గంటల వరకూ అదేస్థాయిలో నిలకడగా కొనసాగింది. తూర్పు డెల్టాకు 500, మధ్య డెల్టాకు 1000, పశ్చిమ డెల్టాకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో నీటి ఉధృతి పెరగడంతో బుధవారం ఉదయానికి కాటన్‌ బ్యారేజ్‌ వద్ద గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాలకు  సంబంధించి కాళేశ్వరంలో 9.80 మీటర్లు, పేరూరులో 10.69 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.46 మీటర్లు, కూనవరంలో 12.52 మీటర్లు, కుంటలో 4.47 మీటర్లు, కొయిదాలో 16.26 మీటర్లు, పోలవరంలో 10.37 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.02 మీటర్ల వద్ద నీటిమట్టాలు  కొనసాగుతున్నాయి.

 

కళకళా తాండవ

కోటనందూరు : విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తాండవ జలాశయం నిండు కుండలా కళకళలాడుతోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా జలాశయం సముద్రాన్ని తలపిస్తోంది. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో భారీగా వర్షాలు పడుతున్నందున ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో వస్తోందని తాండవ అధికారులు చెబుతున్నారు. జలాశయ గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా ఇప్పటికే 372.5 అడుగులకు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. నీటిమట్టం 377 అడుగులకు చేరితే తరువాత వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా అదే స్థాయిలో నీటిని నదికి విడిచి పెడతామని డీఈ రాజేంద్రకుమార్‌ తెలిపారు. ప్రస్తుతం పుష్కలంగా వర్షాలు ఉన్నందున ఆయకట్టుకు నీటి అవసరం లేదని, పంట చివర్లో కొంతమేర నీటిని విడిచి పెట్టి, రబీకి కూడా పూర్తిస్థాయిలో అందుతుందని డీఈ వివరించారు. 

జలాశయాన్ని పరిశీలించిన డీఈ

తాండవ జలాశయాన్ని డీఈ ఎం.రాజేంద్రకుమార్‌ మంగళవారం పరిశీలించారు. జలాశయానికి ఉధృతంగా నీరు వస్తున్నందున ఏఈలు శ్యామ్‌కుమార్, చిన్నారావు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగబాబులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. సందర్శకులను ఎవరిని జలాశయం వద్దకు వెళ్లనీÄñæ¬ద్దని సిబ్బందిని ఆదేశించారు.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top