మూడు రోజుల్లో కోస్తాంధ్రలో అతిభారీ వర్షాలు


విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top