వేధించారంటూ హెచ్చార్సీకి ఫిర్యాదు


కాకినాడ :

కాకినాడ నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారిగా పనిచేసిన డాక్టర్‌ శైలజ జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ సహా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఏసీ, డీసీలకు షాక్‌ ఇచ్చారు. ఎంహెచ్‌వోగా పనిచేసిన సమయంలో వీరంతా తనను వేధింపులకు గురిచేశారంటూ మానవహక్కుల కమిష¯ŒSను ఆశ్రయించారన్న సమాచారం అధికారవర్గాల్లో కలకలం రేపింది. ఆమె ఫిర్యాదుపై శుక్రవారం గుంటూరులో జరిగే విచారణకు కలెక్టర్‌ మినహా మిగిలిన అధికారులంతా హాజరయ్యేందుకు పయనమై వెళ్ళిన అంశం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్ళితే...కాకినాడ నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారిగా డాక్టర్‌ శైలజ 2015 జూలై 17 నుంచి ఏడాది కాలంపాటు ఇక్కడ పని చేశారు. డిప్యూటేష¯ŒS కాలపరిమితి పూర్తి కావడంతో ఆమెను సొంత శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఆమె బదిలీ ఉత్తర్వులను నిలుపుదల చేసి మరో ఏడాదిపాటు కొనసాగేందుకు వీలుగా ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభిస్తున్న సమయంలో ఆమెను రిలీవ్‌ చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపద్యంలో ఆమె తాను ఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిలీవ్‌ అయ్యేంతవరకు ఏడాది కాలంలో తనను ఎన్నో వేధింపులకు గురిచేశారంటూ ఆమె మానవహక్కుల కమిష¯ŒSతోపాటు జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిష¯ŒSకు, ఇతర ఉన్నత స్థాయి అధికార వర్గాలకు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యాధికారిగా చేర్చుకునే సమయంలో అప్పటి కమిషనర్, రిలీవ్‌ చేసే సమయంలో ప్రస్తుత కమిషనర్‌ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆమె తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. వీరంతా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ను కూడా తప్పుదారి పట్టించి తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేలా చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు నేపధ్యంలో దీనిపై హెచ్‌ఆర్‌సీ విచారణకు ఆదేశించింది. 

ఫిర్యాదులో అందరూ బాధ్యులే...

ఆరోగ్యాధికారి డాక్టర్‌ శైలజ హెచ్‌ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో కమిషనర్‌ ఆలీమ్‌భాషా, అదనపు కమిషనర్‌ గోవిందస్వా మి, డిప్యూటీ కమిషనర్‌ సన్యాసిరావు, మేనేజర్‌ సత్యనారాయణ, సహా పలువురు అధికారులను బాధ్యులుగా పేర్కొన్నారు. కలెక్టర్‌ పేరును కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ పురపరిపాలనాశాఖ డైరెక్టర్‌కు విచారణకు ఆదేశించింది. దీంతో మెప్మా అడిషనల్‌ డైరెక్టర్‌ను విచారణాధికారిగా డీఎంఏ నియమించింది. 

నేడు గుంటూరులో విచరణ..

హెచ్‌ఆర్‌సీ ఆదేశాల మేరకు శుక్రవారం గుంటూరులో విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం కాకినాడ కమిషనర్‌తోపాటు ఏసీ, డీసీ, మేనేజర్, సూపరింటెండెంట్‌తోపాటు ఇతర అధికారులంతా గుంటూరు బయలుదేరి వెళ్తున్నారు. వీరితోపాటు ఫిర్యాదు చేసిన డాక్టర్‌ శైలజ కూడా విచారణకు హాజరుకానున్నారు. అయితే కలెక్టర్‌కు మాత్రం విచారణ నుంచి మిçనహాయింపునిచ్చారంటున్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top