హరితహారం చారిత్రాత్మకం

హరితహారం చారిత్రాత్మకం - Sakshi


మేడ్చల్‌: తెలంగాణలో చేపట్టిన తెలంగాణకు హరితహారం దేశ చరిత్రలో చారిత్రాత్మకమైన విషయమని రాష్ర్ట హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్‌ నగర పంచాయతీ పరిధిలోని అత్వెల్లిలో మేడ్చల్‌ పోలీసులు నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మేడ్చల్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు.  ఈ సందర్బంగా ఆయన మట్లాడుతూ దుర్బిక్ష పరిస్థితులను శాశ్వతంగా దూరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాటి అశోక చక్రవర్తిలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాడని అన్నారు.ఇలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.గత ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలను విస్మరించడం వల్లే నేడు తెలంగాణలో కరువు పరిస్ధితులు ఏర్పడ్డాయని ప్రభుత్వం మొక్కలు నాటి అడవుల శాతం పెంచడానికే హరితహారంపై ప్రత్యేక శ్రధ్ద వహిస్తుందని అన్నారు.రాష్ర్టంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, మిషన్‌ భగీరథ,మిషన్‌ కాకతీయ వంటి కార్యక్రమాలు దేశంలోనే గోప్ప ప్రశంసలు పొందాయని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపించిందని తెలిపారు.



            పోలీస్‌ శాఖ ఆద్వర్యంలో ఇప్పటికి 40లక్షల మొక్కలు నాటామని సైబరాబాద్‌ వెస్ట్‌ జోన్‌లోని బాలానగర్‌ డివిజన్‌లో 50వేల మొక్కలు నాటామని రెండుమూడు రోజుల్లో 3వేల మొక్కలు నాటుతామని తెలిపారు. కార్మిక శాఖ ఆద్వర్యంలో 4లక్షల మొక్కలు నాటామని మరో 10లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.తాను హరితహారంలో రాష్ర్టమంతటా పర్యటించి మొక్కలు నాటుతున్నానని ఇలాంటి కార్యక్రమంలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. నగర పంచాయతీ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు ఇంటింటి వద్ద మొక్కలు నాటాలని మొక్కలు సరఫరా చేశారు.కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతీ నాయకుడు మొక్కలు నాటే విధంగా చేసి ఆయన మొక్కలు నాటారు.విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహికంగా మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలోని దుర్గమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బాలానగర్‌ డీసీపీ సాయిశేఖర్‌, పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్‌,మేడ్చల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, మేడ్చల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సత్యనారాయణ, ఎంపీపీ విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బాస్కర్‌యాదవ్‌, మాజీ చైర్మెన్‌ నందారెడ్డి,నాయకులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top