గిన్నిస్‌ రికార్డ్‌కు సాధన

సాధన చేస్తున్న విద్యార్థులు

విజయనగరం కంటోన్మెంట్‌ : విజయనగరం ఉత్సవాల సందర్భంగా ఎక్కువమంది గాత్రధారులచే  గీతాలపన చేసి గిన్నిస్‌రికార్డు నెలకొల్పాలనే ప్రయత్నాల్లో జిల్లా యంత్రాంగం తలమునకలై ఉంది. గురువారం ఇందుకోసం సాధన చేపట్టారు. ఈ రిహార్సల్స్‌లో ప్రొగ్రాం ఇన్‌ఛార్జి ఎం రాజు(ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ) పలు కళాశాలల విద్యార్థులచే పాటను సాధన చేయించారు. ఈనెల 15న గీతాలాపన ప్రదర్శన జరగనుంది. ఇందులో 1500 మంది నుంచి 2వేల మంది వరకు పాల్గొని పాడే అవకాశం ఉంది. సాధన కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త నాడిశెట్టి శాంతారావు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ అనురాధా పరశురాం, లెక్చరర్లు చాగంటి రాజ్యలక్ష్మి, రాధాకష్ణ, త్రినాథ్, బీఏ నారాయణలతో పాటు రఘు, లెండి, జేఎన్‌టీయూ, ఎంవీజీఆర్, ఎమ్మార్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top