24న గ్రేటర్‌ స్టాడింగ్‌ కమిటీఎన్నికలు

24న గ్రేటర్‌ స్టాడింగ్‌ కమిటీఎన్నికలు - Sakshi


నేడు నోటిఫికేషన్‌ విడుదల

ఆరుగురు సభ్యుల ఎన్నికకు సమాయత్తం

నేటి నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ

17న పరిశీలన, అదే రోజు స్క్రూటినీ

19న ఉపసంహరణ.. అదేరోజు తుదిజాబితా వెల్లడి




వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ (స్థాయీ సం ఘం) సభ్యుల ఎన్నికకు నగరా మోగింది. తొలి స్టాండింగ్‌ కమిటీ సభ్యుల పదవి కా లం ఏడాదితో ముగిసింది. ఈ మేరకు రెం డో దఫా స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక షెడ్యూల్‌ ఖరారైంది. మం గళవారం గ్రేట ర్‌ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక నోటిఫికేషన్‌ను కమిషనర్‌ శృతి ఓజా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే గ్రేటర్‌ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్ర క్రియ ప్రారంభం కానుంది.  ఈ నెల 16న మ« ద్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.



ఈ నెల 24న స్టాండిం గ్‌ కమిటీల సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నారు. గ్రేటర్‌ పరిధిలో 58 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో ఆరుగురు స్టాండింగ్‌ కమిటీ సభ్యులను ఎన్ని కోవా ల్సి ఉంటుంది. గతంలో స్థాయీ సం ఘాన్ని ఏర్పాటు చేసేందుకు వరుస క్రమంలో పది డివిజన్లకు ఒక స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిని ఎన్నుకునే వారు. పది మంది కార్పొరేటర్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా మారాయి. వరుస క్రమంలో కాకుండా 58 డివిజన్ల నుంచి ఎవరైనా పోటీ చేసేందుకు వీలు కల్పించారు. గత ఏడాది ఆగస్టులో ఆరుగురు కార్పొరేటర్లు స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా నామినేషన్లు దాఖాలు చేయగా, పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి మోజార్టీ సభ్యులు ఉండడం వల్ల ఏకగ్రీవ ఎన్నిక సులువైంది. ఈ దఫా కూడా పోటీ లేకుండా సభ్యులను ఖరారు చేయనున్నారు. దీంతో స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక అనుకున్నట్లుగా జరగనుంది.



ఎన్నికల షెడ్యూల్‌ ఇలా...

►8న స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.

►గ్రేటర్‌ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 8 నుంచి 16 వరకు ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు  కార్పొరేటర్ల నుంచి గ్రేటర్‌ కార్యదర్శి నామినేషన్ల పత్రాలను  స్వీకరిస్తారు.

►16న సాయంత్రం 3గంటలకు నామినేషన్ల జాబితా వెల్లడి

►17న నామినేషన్ల పరిశీలన, అదే రోజు స్క్రూటినీ... ఆ తర్వాత చెల్లుబాటు నామినేషన్ల జాబితా ప్రకటన

►19న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ. అదే రోజు సాయంత్రం బరిలో నిలిచి అభ్యర్థుల పేర్ల ప్రకటన.

►24న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం  ఒంటి గంట వరకు గ్రేటర్‌ ప్రధాన కార్యాలయంలో పోలింగ్‌. సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు విడుదల.



2016 ఏడు సమావేశాలే..!

నిబంధనల ప్రకారం 15 రోజులకోసారి స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరగాలి.  ఏడాదిలో 24 సార్లు స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా.. ఏడు సార్లు మాత్రమే నిర్వహించారు.  తొలి స్టాండింగ్‌ కమిటీ సమావేశం 2016 నవంబర్‌ 9న, రెండో సమావేశం నవంబరు 22న, మూడోది అక్టోబర్‌ 10న, నాలుగోది డిసెంబర్‌ 23న,  ఐదోది ఫిబ్రవరి 18న, అరోదిజూలై 3న, ఇక చివరి సమావేశం జూలై 18న జరిగింది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top