ఎ ఫర్.. యాపిల్!

ఎ ఫర్.. యాపిల్!


శ్రీకాకుళం: జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లోని చిన్నారులకు అ.. అమ్మతో పాటు ఎ ఫర్ యాపిల్‌ను కూడా బోధించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసి ఫలితాల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా అమ లు చేయాలని కలెక్టర్ భావిస్తున్నారు. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో అందరి దృష్టికి తేవాలని కలెక్టర్ నిశ్చయించారు.



1 నుంచి 5వ తరగతి వరకు ఆంగ్ల బోధన చేయించడం ద్వారా ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొగ్గు చూపించకుండా ఉంటారని, పేద విద్యార్థులకు కూడా ఆంగ్ల బోధన అందుబాటులో ఉంటుందని కలెక్టర్ ఆలోచన . ఇప్పటికే జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను సేకరించారు. జిల్లాలో 2249 ప్రాథమిక పాఠశాలలు ఉండగా వీటిలో 83,598 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ ఇప్పటివరకు తెలుగు మాధ్యమంలో చదువుతుండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం సక్సెస్ స్కూ ళ్ల పేరిట ఆంగ్ల మాధ్యమ విద్యను ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయిలో అవి సత్ఫలితాలనివ్వలేదు.

 

ప్రాథమిక స్థాయిలో ఆంగ్లంపై పట్టులేకపోవడం వల్ల ఉన్నత తరగతుల్లో ఆంగ్ల మా ధ్యమం చదవలేక సగంలోనే బడి మానేయడమో, తెలుగు మాధ్యమానికి మారిపోవడమో జరుగుతూ వస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి అంగన్‌వాడీ కేం ద్రాల్లోని మూడేళ్ల లోపు పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి తరగతుల్లో బోధన చే యించాలని నిశ్చయించి ఇందుకు తగ్గట్టుగా త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.



అంగన్‌వాడీలోని పిల్లలను సమీపంలోని ప్రాథమిక పాఠశాలలకు తీసుకొచ్చి ఉపాధ్యాయులతో ప్రీ ప్రైమ రీ విద్యను చెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యో చిస్తోంది. అందుకే ఇదే అదనుగా ఆంగ్ల మాధ్యమాన్నీ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోను ఓ పాఠశాలను ఎంపిక చేసి తొలి దశగా ఆ పాఠశాలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించి ఆంగ్ల మాధ్యమ పాఠశాలగా పనిచేసేలా చూడాలని కూడా కలెక్టర్ భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన స మాచారాన్ని కూడా ఇప్పటికే విద్యాశాఖ అధికారుల నుంచి తీసుకున్నారు.



ఈ విషయమై కూ డా రాష్ట్ర అధికారులతో చర్చించనున్నారు. కలెక్టర్ ఆలోచనలకు రాష్ట్ర అధికారులు సమ్మతిస్తే పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ బోధన అం దుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం వద్ద సాక్షి ప్రస్తావిం చగా ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమా న్ని ప్రవేశపెట్టాలని యోచిస్తుండడం నిజమేనన్నారు. త్వరలోనే దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు.

 

ఉపాధ్యాయులు సరిపడినంత మంది ఉంటే ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఆం గ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు వద్ద ప్ర స్తావించగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను పాఠశాలల్లో బోధింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. అలాంటప్పుడు ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఆంగ్ల బోధన ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ వద్ద ప్రస్తావించినపుడు ఆయన సానుకూలంగా స్పందించి రాష్ట్ర అధికారులతో మాట్లాడతానని తెలిపారన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top