పరిశోధనలతో రైతులకు మేలు

పరిశోధనలతో రైతులకు మేలు

తాడేపల్లిగూడెం రూరల్‌ :  రైతులకు మేలు చేసేలా విద్యార్థులు పరిశోధనలు జరపాలని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ చిరంజీవి చౌదరి అన్నారు. మండలంలోని వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాల 10వ వార్షికోత్సవం శనివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి చౌదరి మాట్లాడుతూ వ్యవసాయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. చదువుతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందించే సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులు నైపుణ్యం కనబర్చాలన్నారు. అనంతరం చదువు, పాటల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.శ్రీనివాసులు, డీ న్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ డాక్టర్‌ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, లైబ్రేరియ న్‌ డాక్టర్‌ ఎంబీ నాగేశ్వరరావు, డాక్టర్‌ డి.శ్రీహరి, డాక్టర్‌ జె.దిలీప్‌రెడ్డి, డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top