పంచాయతీలకు నిధులొచ్చాయ్..

పంచాయతీలకు నిధులొచ్చాయ్..


గ్రామాల అభివృద్ధికి రూ.43.56కోట్లు

  14వ ఆర్థిక సంఘం తొలిదఫా విడుదల

  విద్యుత్‌బిల్లులు, పెండింగ్ బకారుులకు మోక్షం

 


కరీంనగర్‌సిటీ :

పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రూ.43.56 కోట్లు నిధులు కేటారుుంచారు.గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, వివిధ అభివృద్ధి పనుల కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ డెరైక్టర్ నీతూప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.



ఎనిమిది నెలలు ఆలస్యంగా..

 గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థికసంఘం నిధుల కేటారుుంపులను ఏటా పెంచుతోంది. ఈ సంవత్సరం సైతం నిధులు అధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వచ్ఛభారత్ నిర్మాణమే లక్ష్యంగా తాగునీరు, డ్రెరుునేజీలు, సీసీరోడ్లు తదితర అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. అంతేకాకుండా ఈ నిధుల నుంచే పంచాయతీల విద్యుత్ బిల్లులు, బకారుులు ముప్పై శాతం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఆర్థికసంవత్సరంలో నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈక్రమంలోనే జిల్లాల విభజన, మండలాల విలీనం, కొత్త కార్యాలయాల ఏర్పాటుతో పాలన గాడిలో పడడానికి సమయం పట్టింది. చిన్న జిల్లాలతో అభివృద్ధి వేగం పెంచేందుకు ఆయా జిల్లాలవారీగా ప్రభుత్వం నిధులు కేటారుుంచింది. ఆర్థిక సంవత్సరం ఆరంభమైన ఎనిమిది నెలలకు నిధులు విడుదల చేసింది.



జనాభా ఆధారంగానే..

ఉమ్మడి జిల్లాలో 1,207 గ్రామాలుండేవి. సిద్దిపేట, వరంగల్ అర్బన్, ప్రొఫెసర్‌జయశంకర్ జిల్లాల పరిధిలోకి వెళ్లిన గ్రామాలు మినహారుుస్తే ప్రస్తుతం 1,020 గ్రామాలున్నారుు. 2011 జనాభా ప్రాతిపదికన ఈ నిధులను కేటారుుంచారు. ఉమ్మడి జిల్లాలో 37,76,269 జనాభా ఉంది. గతేడాది కంటే ప్రస్తుతం నిధులు అధికంగా వచ్చారుు. వీటితోపాటు పెద్ద నోట్ల రద్దుతో పంచాయతీలకు పన్నుల రూపంలో నిధుల వరద పారింది. ఉమ్మడి జిల్లాలో రూ.15 కోట్ల వరకు వసూలయ్యారుు.  



కొత్త జిల్లాలకు..

తాగునీటి సరఫరా పథకాలు,  డ్రెరుునేజీలు, కల్వర్టుల నిర్మాణం, అంగన్‌వాడీ భవనాలు, ఏఎన్‌ఎం సబ్‌సెంటర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, అంతర్గత రోడ్ల మరమ్మతులు, వీధిలైట్లు, తాగునీటి వాటర్‌ప్లాంట్ తదితర పను లు చేసుకునే అవకాశం ఉంది. నిధులను ఆయా జిల్లాల్లోని సబ్ ట్రెజరీ కార్యాలయా ల ద్వారా గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేస్తారు. కొత్త జిల్లాల్లోని జనాభా ఆధారంగానే నిధులు కేటారుుంచారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకే అధికంగా కేటారుుంచారు. సగటున గ్రామానికి రూ.5 నుంచి రూ.8లక్షల వరకు కేటారుుంచనున్నారు. తిరిగి మార్చిలో మరో రూ.40 కోట్లు విడుదలయ్యే అవకాశముంది.   

 

 నిధులు రాక ఇలా..

 జిల్లా                         నిధులు

 కరీంనగర్                  రూ.12,31,64,800

 రాజన్నసిరిసిల్ల          రూ.7,98,82,300

 జగిత్యాల                   రూ.13,79,29,100

 పెద్దపల్లి                     రూ.9,46,28,600

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top