14న ఆర్యవైశ్యులకు ఉచిత వివాహాలు


కడప కల్చరల్‌ :

శ్రీ ఆర్యవైశ్య సామూహిక వివాహ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 14న ఉదయం 9.15 గంటలకు ఆర్యవైశ్యులకు సామూహిక వివాహాలను చేయనున్నామని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఆర్యవైశ్య యువతీ యువకులు జులై 31వ తేదీలోగా సంస్థ కార్యదర్శికి దరఖాస్తులు అందజేయాలన్నారు. వివాహానికి అవసరమైన మంగళ వాయిద్యాలు, పురోహితులు, భోజనం, అల్పాహారం, విడిది సౌకర్యం, వివాహ వస్త్రాలు, మెట్టెలు, వెండి జంధ్యం, తల్లిపక్షం తాళిబొట్టు కూడా సంస్థ అందజేస్తుందన్నారు. పూర్తి వివరాలకు సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

యజ్ఞోపవీత ధారణ       

శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఆగస్టు 18న ఆర్యవైశ్య సామూహిక వివాహ సంస్థ ఆధ్వర్యంలో యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించనున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పాల్గొనదలిచిన వారు కుంకుమబొట్టు పెట్టుకుని పంచె, టవల్‌ ధరించి రావాలన్నారు. సంస్థ ఆధ్వర్యంలో రాగి ప్లేటు, పంచపాత్ర, ఉద్దరిణి ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top