అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయం

అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయం


►  మంత్రులు రామన్న, ఐకే రెడ్డి  

► అభివృద్ధి పనులకు శంకుస్థాపన




బోథ్‌ : అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని అటవీశాఖ మంత్రి జోగు రామన్న, గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం బోథ్‌ మండలం సొనాల గ్రామంలోని రామాలయంలో రూ.38లక్షలతో నిర్మించతలపెట్టిన ధ్యాన మందిరం, రూ.96 లక్షలతో చేపట్టనునన్న బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 106 సంచార కులాలను ఎంబీసీలో కలుపుతూ వారికి బ్యాంకులకు సంబంధం లేకుండా నేరుగా రూ.వెయ్యి కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.


బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక ప్రధాన్యత ఇచ్చిందన్నారు. బీసీ కులాలకు చెందిన    విద్యార్థులకు విదేశీ చదువుల ఖర్చును    ప్రభుత్వమే భరిస్తుందన్నారు. త్వరలోనే 500 జనాభా కలిగిన తండాలు, గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా  గ్రామ కుర్మ సంఘానికి రూ.5లక్షలు, మున్నూరు కాపు సంఘానికి రూ.10లక్షలు మంజూరు చేశారు. ఎంపీ నగేశ్‌ మాట్లాడుతూ మండలంలోని పొచ్చర క్రాస్‌ రోడ్డు నుంచి ఘన్ పూర్‌ వరకు రూ.36 కోట్ల కేంద్రం నిధులతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.


జాతర్ల నుంచి సొనాల గ్రామం వరకు త్వరలోనే డబుల్‌ రోడ్డు నిర్మాణం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావ్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. సొనాల పాఠశాలకు రూ.30లక్షల నిధులతో ప్రత్యేక గదులు, ప్రహరీ నిర్మాణం చేపడతామన్నారు. పాడి పరిశ్రమ చైర్మన్  లోక భూమారెడ్డి, బీసీసీబీ చైర్మన్  దామోదర్‌ రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్  రాంకిషన్ రెడ్డి, నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్  అప్పాల గణేశ్‌చక్రవర్తి, ఆదిలాబాద్, బోథ్‌ మార్కెట్‌ కమిటీల చైర్మన్లు అరె రాజన్న, నల్ల శారద, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్ తుల శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, ఎంపీపీ గంగుల లక్ష్మి తదితరులున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top