రైతన్న కన్నెర్ర


  • సాగు భూములు నష్టపోతున్నామని ఆవేదన

  • ‘పురుషోత్తపట్నం’ పైప్‌లై¯ŒS పెగ్‌ మార్కింగ్‌ తొలగింపు

  • ఎకరానికి రూ.60 లక్షలు చెల్లించాలని డిమాండ్‌

  • సీతానగరం (రాజానగరం) : 

    పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లై¯ŒS నిర్మాణానికి తమ పంట భూములలో అధికారులు వేసిన పెగ్‌ మార్కింగ్‌ను రైతులు ఆదివారం తొలగించారు. ఎత్తిపోతల పథకంలో కోల్పోనున్న తమ భూములకు ఎకరానికి రూ.60 లక్షలు పరిహారం ఇవ్వాలని రామచంద్రపురం, పురుషోత్తపట్నం రైతులు డిమాండ్‌ చేశారు. గత నెల 28 నుంచి ఎత్తిపోతల పథకం ప్రత్యేక సర్వేయర్‌ జాఝ్వ, సర్వేయర్‌లు నాగరాజు, మోహన్, కృష్ణంరాజు, లక్ష్మణరావు, పీవీకే ప్రసాద్, రమణ, సఫీఉల్లా, శ్రీనివాసరావు, ప్రకాషరావు, లక్షి్మతో పాటు పది మంది లైసె¯Œ్సడ్‌ సర్వేయర్లు భూములను సర్వే చేసి పెగ్‌ మార్కింగ్‌ చేశారు. అందులో చినకొండేపూడిలో 83.26 ఎకరాలు, నాగంపల్లిలో 43.24 ఎకరాలు, పురుషోత్తపట్నంలో 123.09 ఎకరాలు, వంగలపూడిలో పది మంది రైతులకు సంబంధించి 4.50 ఎకరాల భూమిలో సర్వే చేసి పురుషోత్తపట్నం నుంచి గండికోట వరకు వెళ్లే 10 కిలో మీటర్లు పైప్‌లై¯ŒSకు పెగ్‌ మార్కింగ్‌ చేశారు. ఇది ఈ నెల 21కి పూర్తయింది. అయితే ఎరానికి రూ.60 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ భూమిని కోల్పోతున్న రామచంద్రపురంనకు చెందిన కలగర వెంకటరామారావు (బుజ్జి), కరుటూరి శ్రీను, ఉండవల్లి శ్రీనివాసరావు, ఉండవల్లి రమేష్, ఉక్కుచూరి పోశయ్య, కొండిపాటి ప్రకాశం, చళ్లమళ్ల సుజీరాజు, కొండిపాటి కోటేశ్వరరావు, మద్దిపాటి వెంకట రామారావు, మద్దిపాటి కుసరాజు, దుద్దిపూడి వెంకటేశ్వరరావు, దుద్దిపూడి వెంకటరామారావు, చళ్లమళ్ల విజయభాస్కర చౌదరి, కోడేబత్తుల గోవిందరావు, దుగ్గిరాల చిరంజీవి, పురుషోత్తపట్నంకు చెందిన ఈలి శ్రీను, కొండి నానిబాబు, శరత్‌ తదితరులు తమ పంట పొలాలో వేసిన పెగ్‌ మార్కింగ్‌ తొలగించారు. పలు పథకాలు ఇక్కడే కడుతున్నారని, వీటికే తమ పంట పొలాలు పోతున్నాయని వాపోయారు. ఇప్పుడు ఎటువంటి పరిహారం నిర్ణయించకుండా సర్వే చేసి, తమ ఇష్టానుసారం అధికారులు, ప్రజాప్రతినిదులు వ్యవహరిస్తున్నారని దుయ్యపట్టారు. ఎట్టి పరిస్థితిలోను త భూముల గుండా పైప్‌లై¯ŒS వెళ్లనిచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు.

     

    కలెక్టర్‌ సమావేశానికి వెళ్లం

    రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం జరిగే కలెక్టర్‌ సమావేశానికి వెళ్లమని, అధికారులే నేరుగా వచ్చి తమతో సమావేశం జరపాలని పురుషోత్తపట్నం, రామచంద్రపురం రైతులు తెలిపారు. ఇరు గ్రామాల రైతులు సమావేశం అయిన అనంతరం కలెక్టర్‌ సమావేశాన్ని బహిష్కరిస్తూ తీర్మానం చేశామని చెప్పారు.

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top