టీడీపీ నాయకుల కుమ్ములాట

టీడీపీ నాయకుల కుమ్ములాట - Sakshi


కామాక్షితాయి ఆలయ చైర్మన్‌గిరి కోసం పోలంరెడ్డిపై ఒత్తిడి

బుచ్చికి నో.. కొడవలూరుకు ఎస్ దరఖాస్తు చేయలేదని

కోవూరు, ఇందుకూరుపేట నేతలపై నెపం


 

 బుచ్చిరెడ్డిపాళెం : జొన్నవాడ కామాక్షితాయి ఆలయ చైర్మన్ పదవిపై టీడీపీ నేతల్లో అంతర్మథనం నెలకొంది. సిఫార్సుల పర్వం కొనసాగుతోంది. దరఖాస్తుచేయలేదన్న నెపంతో కోవూరు, ఇందుకూరుపేట మండలాల ఆశావహులకు చెక్‌పడింది. బీద సోదరుల అండ ఉందని ఓ వర్గం చెలరేగుతుంటే, సొంత మండలానికి ఇవ్వాలని పోలంరెడ్డిపై మరోవర్గం ఒత్తిడి పెంచింది. దీంతో కామాక్షితారుు ఆలయ చైర్మన్ పదవి కోసం జరుగుతున్న టీడీపీ నాయకుల అంతర్గత కుమ్ములాటపై కథనం.  



 జొన్నవాడ కామాక్షితారుు ఆలయం చైర్మన్ పదవి విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రధాన పదవి పెన్నాడెల్టా చైర్మన్ పదవి ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డికి ఇవ్వడంతో మరో ప్రధాన పదవిని అదే మండలానికి కేటారుుంచేందుకు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విముఖత చూపుతున్నారు. కొడవలూరు మండలానికి ఇవ్వాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన పుట్టా సుబ్రహ్మణ్యనాయుడు, చీమల జనార్దన్‌కు చెక్ పడనుంది. ఈ క్రమంలో అసలు దరఖాస్తు చేయకుండా పోటీకి ఎలా అని చీమల జనార్దన్‌తో పోలంరెడ్డి చర్చించినట్లు తెలిసింది. దీంతో చీమల జనార్దన్ అటు బీద సోదరులు, ఇటు యాదవసంఘం నేతల నుంచి ఒత్తిడి తెచ్చి చైర్మన్‌గిరి పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదే క్రమంలో ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు తనను ఇప్పటికే ఖరారు చేసి, ఇప్పుడు రాజకీయం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. దీనికి తోడు అసలు దేవాదాయశాఖకు దరఖాస్తు చేయకుండానే చీమల జనార్దన్ పదవిని ఆశించడంపై పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు వర్గీయులు మండిపడుతున్నారు.  



 దరఖాస్తుచేయలేదన్న నెపంతో కోవూరు, ఇందుకూరుపేట నేతలకు చెక్

 బుచ్చిరెడ్డిపాళెం మండల నేతలకే ప్రధాన పదవులు కట్టబెట్టడంపై కోవూరు, కొడవలూరు, ఇందుకూరుపేట మండల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో బుచ్చిరెడ్డిపాళెం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్లు సాధించిందని చెబుతున్నారు. టీడీపీకి పట్టున్న రేబాల, ఇస్కపాళెం, నాగాయగుంట, నాగమాంబాపురం, కాగులపాడు తదితర ప్రాంతాల్లో టీడీపీ ఎక్కడ ఓట్లు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. కొడవలూరు, కోవూరు మండలాల్లోనే మెజార్టీ వచ్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలో పార్టీని నమ్ముకున్న తమను విస్మరిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అరుుతే దరఖాస్తు చేయలేదన్న నెపంతో ఇందుకూరుపేట, కోవూరు మండలాల్లోని ఆశావహుల్లో ప్రధానవ్యక్తులకు చెక్‌పెట్టినట్టు తెలిసింది. ఇక కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సొంత మండలం కొడవలూరు మండలంలోని వ్యక్తులకు ఈ పదవి ఇవ్వనున్నట్లు విశ్వసనీయమైన సమాచారం.

 

 రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా  

 కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే ప్రధాన పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారని, కామాక్షితారుు ఆలయ చైర్మన్ పదవి ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top