రిజిస్ట్రేషన్ల కోసం రిలే దీక్షలు

రిజిస్ట్రేషన్ల కోసం రిలే దీక్షలు - Sakshi

నాలుగు గ్రామాల రైతులు, ప్రజల ఆందోళన 

కోరుకొండ : తమ భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుకొండ, జంబూపట్నం, కోరుకొండ, కాపవరం శ్రీరంగపట్నం గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు బుధవారం కోరుకొండలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రెండున్నరేళ్లుగా ఇళ్ల స్థలాలు, పొలాలను రిజిస్ట్రేషన్‌ చేయకుండా నిలిపివేశారని పలువురు విమర్శించారు. న్యాయం కోరుతూ అన్నవరం ఈఓ కాకర్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా తమకు అండగా శాంతియుతంగా ఆందోళన చేశారని తెలిపారు. తమ భూములు దేవస్థానానికి సంబంధం లేకున్నా రిజిస్ర్టేషన్లు నిలిపివేయడం దారుణమని తెలిపారు. బాధితులు నీరుకొండ నాగేశ్వరరావు, బొండాడ గొల్లారావు, దేవినేని ప్రభాకరరావు, పసుపులేటి సత్యనారాయణ, కాటూరి రాంమ్మోహన్, సూరిశెట్టి లక్ష్మణరావు, ఉప్పలపాటి వీరాస్వామి, ముండ్రు రామారావుచౌదరి, గరగ వెంకటేశ్వరరావు, ద్వారంపూడి చిన్ని తదితరులు రిలే దీక్ష చేపట్టారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ, లోక్‌సత్తా, కాంగ్రెస్‌ ‡పార్టీల నేతలు శిబిరానికి చేరుకుని వీరి ఆందోళనకు మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సాయంత్రం దీక్షధారులకు డ్రింక్‌ ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. డాక్టర్‌ పెద్దింటి సీతారామ భార్గవ, కల్యాణం రాంబాబు, కటకం చలం, ఇసుకపల్లి రాజారావు, బావన రాంబాబు, నీరుకొండ బాబ్జీ, జాజుల సత్తిబాబు, వుల్లి ఘననాథ్‌, మాతా ప్రభు, తరగరంపూడి గణపతి, ముత్యం గిరి, కర్రి వీరగణేష్, గరగ శ్రీధర్‌బాబు, రొంగలి శ్రీను, కాళ్ల శ్రీరాములు తదితరులు మద్దతు పలికిన వారిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ వివిద విభాల నాయకులు తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, గరగ మధు, వాకా నరసింహరావు, తిక్కిరెడ్డి హరిబాబు, సూరిశెట్టి భద్రం, గుగ్గిలం భాను, తోరాటి శ్రీను, సూరిశెట్టి అప్పలస్వామి, అయిల రామకృష్ణ తదితరులున్నారు. 

వారికి అండగా ఉంటాం...

కోరుకొండలో భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేయడంపై సబ్‌ రిజిష్టర్‌, అన్నవరం ఈఓ తీరుపై వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. రైతులు, ప్రజలకు న్యాయం చేసేంతవరకూ పార్టీ అండగా ఉంటుందన్నారు.

వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని హమీ ఇచ్చారు. సబ్‌ రిజిష్టర్‌ కార్యాలయానికి వెళ్లిన ఆమె ఈ విషయంలో సబ్‌రిజిష్టార్‌ నరసింహరావును నిలదీశారు. భూముల రిజిస్ట్రేషన్లు చేయరాదని అన్నవరం దేవస్థానం నోటిసు ఇచ్చిందని ఆయన వివరించారు. ఈ విషయాన్ని కలెక్టర్, దేవాదాయ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top