రేపు దానిమ్మ తోటల సాగుపై శిక్షణ
అనంతపురం అగ్రికల్చర్ : ఆధునిక పద్ధతుల్లో దానిమ్మ తోటలు – యాజమాన్య పద్ధతుల అంశంపై మంగళవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో రైతులకు శిక్షణ ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా తెలిపారు.
కర్నూలు జిల్లా మహానంది ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సి.సుబ్రమణ్యం, రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ఆర్గానిక్ ఫార్మింగ్ శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు హాజరై అవగాహన కల్పిస్తారన్నారు. దానిమ్మ రైతులు వినియోగించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు... 08554–270430, 81420 28268 నంబర్లలో సంప్రదించవచ్చునని సూచించారు.