జూదాల్లో జోరుగా దొంగనోట్లు

జూదాల్లో జోరుగా దొంగనోట్లు - Sakshi

ఆకివీడు(ఉండి) : జూదాల్లో దొంగనోట్లు జోరుగా చలామణి అయ్యాయి. అయిభీమవరం గామంలోని ఎఫ్‌సీఐ గిడ్డంగి ప్రాంతంలోని కోడి పందేల బరిలో  ఏర్పాటు చేసిన పేకాట కేంద్రంలో సోమవారం నకిలీ రూ.2వేల నోట్లు బయటపడ్డాయి. కోతాట ఆడుతుండగా  కృష్ణా జిల్లా పెదలంక గ్రామానికి చెందిన ఒక యువకుడు రూ.2వేల నోటును పందెంగా కాశాడు. దీనిని దొంగనోటుగా గుర్తించిన తోటì జూదరులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అప్పటికే పేకాట కేంద్రంలో సుమారు రూ.లక్షకుపైగా దొంగనోట్లు చలామణి అయ్యాయని తెలుస్తోంది. దీంతో అందరూ తమకు వచ్చిన నోట్లను చూసుకోగా, చాలామంది వద్ద దొంగనోట్లు కనిపించాయి.  వారంతా లబోదిబోమన్నారు. ఇదే అదునుగా పేకాట కేంద్రాన్ని ఒక్కసారిగా ఎత్తివేసి కోతాటలో జూదరులు పందెంగా కాసిన రూ.3 లక్షలను నిర్వాహకులు స్వాహా చేశారు.  భీమవరం గ్రామానికి చెందిన ముదుండి గణపతిరాజు మాట్లాడుతూ.. కోతాట కేంద్రాన్ని ఎత్తివేయడంతో తాను రూ.లక్షా50 వేలు నష్టపోయాయని ఆవేదన చెందాడు.  కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామానికి చెందిన చోడదాసి గంగయ్య కూడా దొంగనోట్లతో నష్టపోయినట్టు చెప్పాడు. పేకాట కేంద్రంలో గత మూడు రోజులుగా సుమారు రూ.10 లక్షల విలువైన దొంగనోట్లు చలామణి అయిపోయాయని సమాచారం. 

 

పట్టుబడిన వ్యక్తి ఏమయ్యాడు? 

దొంగనోటు పందెం కాసి పట్టుబడిన కృష్ణాజిల్లాకు చెందిన వ్యక్తి ఏమయ్యాడో ఎవరికీ తెలియడం లేదు. అతనికి దేహశుద్ధి చేసిన నిర్వాహకులు పంపించివేశారని కొందరు చెబుతుండగా, పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చామని ఇంకొందరు  చెబుతున్నారు. కొంత మంది కష్ణాజిల్లా పోలీసులు వచ్చి తీసుకువెళ్లారని మరికొందరు చెబుతున్నారు.  అయితే ఈ వ్యవహారమంతా జాద క్రీడ నిర్వాహకుల కన్నుసన్నల్లోనే జరిగిందని  జూదరులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉం డగా కోతాటలో ఉండి మండలం పాందు వ్వకు చెందిన వ్యక్తి రూ.వెయ్యి పందెం కాయగా,  రూ. 2 వేలు నోటు ఇచ్చారు. అది దొంగనోటని తరువాత తెలిసింది. దీంతో అతను లబోదిబోమంటున్నాడు. 

 

దొంగనోటు ఇలా.. 

పట్టుబడిన దొంగనోటులో తెల్లభాగం వద్ద గాంధీ బొమ్మ వాటర్‌ మార్క్‌ లేదు. కాగితం మధ్య భాగంలో మెరిసే థ్రెడ్‌(ఆర్‌బీఐ) సిల్కు దారం కూడా లేదు.  కాగితం ఫోటోస్టాట్‌ పేపరుగా ఉంది.   

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top