అడ్డు తొలగించుకునేందుకే హత్య

అడ్డు తొలగించుకునేందుకే హత్య - Sakshi


విజేందర్‌రాజు హత్య కేసులో ఇద్దరి అరెస్టు

♦ మరో నిందితుడి కోసం గాలింపు

♦ వివాహేతర సంబంధమే హత్యకు కారణం

♦ జమ్మికుంట సీఐ ప్రశాంత్‌రెడ్డి వెల్లడి

♦ మృతుడి శరీరంపై 22 కత్తిపోట్లు..!

జమ్మికుంట:

జమ్మికుంట మాజీ సర్పంచ్‌ ఎర్రం రాజు కృష్ణం రాజు కుమారుడు విజేందర్‌రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు కోనారెడ్డితోపాటు అతడికి సహకరించిన పాతకాల అనిల్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పింగిళి ప్రశాంత్‌రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జమ్మికుంటకు చెందిన విజేందర్‌రాజు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించేవాడు. వీణవంక మండలం బొంతుపల్లికి చెందిన జున్నూతుల కోనారెడ్డి జమ్మికుంట సమీపంలోని కొత్తపల్లిలో నివాసం ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.



ఈ క్రమంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి కొంతకాలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించారు. ఇదేక్రమంలో విజేందర్‌రాజు భార్యతో కోనారెడ్డికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో విజేందర్‌రాజు దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో విజేందర్‌రాజు భార్య మూడున్నరేళ్లుగా హన్మకొండలో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు కోనారెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో కోనారెడ్డి, విజేందర్‌రాజు మధ్య విభేదా లు ఏర్పడ్డాయి. దీంతో విజేందర్‌రాజును అడ్డు తొల గించుకోవాలని కోనారెడ్డి పథకం వేశాడు. ఈ నెల 19న హన్మకొండకు వెళ్లిన కోనారెడ్డి తిరిగి జమ్మికుంటకు వస్తున్న సమయంలో కమలాపూర్‌లో మద్యం సేవించాడు. కొత్తపల్లి వద్ద మళ్లీ మద్యం తాగాడు. సాయంత్రం సమయంలో కోనారెడ్డి, విజేందర్‌రాజు సెల్‌ఫోన్‌లో ఒకరినినొకరు దుర్భాషాలాడుకున్నారు.



కోపోద్రిక్తుడైన విజేందర్‌రాజు కొత్తపల్లిలోని కోనారెడ్డి ఇంటికి బైక్‌పై బయల్దేరాడు. కోనారెడ్డి సైతం విజేందర్‌రాజు కోసం కత్తి తీసుకొని బైక్‌ వస్తున్న క్రమంలో రైల్వే ప్లైఓవర్‌ బ్రిడ్జి కింద ఇద్ద రు ఎదురుపడి కొట్టుకున్నారు. కోనారెడ్డి వెంట తెచ్చుకున్న కత్తితో విజేందర్‌రాజును పొడిచి హత్య చేశాడు. విజేందర్‌రాజు సోదరుడు రాజేందర్‌రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టామని, శనివారం కొత్తపల్లిలోని అద్దె ఇంట్లో కోనారెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు. వివాహేతర సంబంధానికి అడ్డున్నాడనే ఉద్దేశంతో విజేందర్‌రాజును హత్య చేసినట్లు కోనారెడ్డి అంగికరించాడని తెలిపారు. హత్యకు సహకరించిన పాతకాల అనిల్‌ను సైతం అరెస్ట్‌ చేయగా, వొజ్జా శ్రీనివాస్‌ పరారీలో ఉన్నాడని చెప్పారు. సమావేశంలో జమ్మికుంట ఎస్సైలు గణేష్, సతీష్, ఇల్లందకుంట ఎస్సై నరేష్‌ పాల్గొన్నారు.



22 కత్తిపోట్లు..?

పోలీసులు మొదట విజేందర్‌రాజు శరీరంలో 16 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. కానీ ఛాతి, గొంతు, ఊపిరితిత్తులు, వీపుభాగంలో 22 కత్తిపోట్లు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో తేలిసినట్లు సమాచారం. దీంతో విజేందర్‌రాజును   కోనారెడ్డి కత్తితో దారుణంగా పొడిచి చంపినట్లు తెలుస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top