ప్రయోగాత్మకంగా పోలీసింగ్‌

ప్రయోగాత్మకంగా పోలీసింగ్‌

కొవ్వూరు : పోలీస్‌ వ్యవస్థను మరింత సమర్థవంతంగా పటిష్టంగా నిర్వహించాలన్న సంకల్పంతో జిల్లా పోలీస్‌ అధికారులు సామాజిక పోలీస్‌ అధికారుల (కమ్యూనిటీ పోలీసింగ్‌ ఆఫీసర్‌లు) నియామకం చేపడుతున్నారు. వీరినే సీపీవోలుగా పిలుస్తారు. చిత్తూరు జిల్లాలో ప్రయోగత్మాకంగా ఏర్పాటు చేసిన ఈ సీపీవోల వ్యవస్థ మంచి ఫలితాలను అందించడంతో మన పోలీస్‌ అధికారులు జిల్లాలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 

సత్ఫలితాలను ఇస్తుందా

పదిహేనేళ్ల క్రితం పోలీస్‌ శాఖలో మైత్రీ సభ్యులుగా కొంతమందికి సత్‌ప్రవర్తన కలిగిన వ్యక్తులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. మొదట్లో ఈ విధానం సత్ఫలితాలను అందించినప్పటికీ కొందరు సభ్యులు గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేయడంతో ఈ విధానం రద్ధు చేశారు. ఇప్పుడు ఈ కొత్త విధానం ఎంతవరకు సత్ఫలితాలను అందిస్తుందనేది వేచి చూడాల్సిందే. ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా, ఏ విధమైన నేర చరిత్రలేని సత్ప్రవర్తన కలిగిన 18 ఏళ్లు నిండిన వారందరికీ పోలీస్‌ శాఖ సీపీవోలుగా అవకాశం కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రతి పోలీస్‌  స్టేషసాపురం పోలీస్‌ సబ్‌డివిజన్‌ల పరిధిలో వీరి నియామకం చేపట్టారు. తాజాగా కొవ్వూరు సబ్‌ డివిజన్‌లోనూ సీపీవోల వ్యవస్థ సోమవారం నుంచి అందుబాటు లోకి రానుంది. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సోమవారం కొవ్వూరులో భారీ ఏర్పాటు చేశారు. ఈ నెల 21న తణుకులో, 22న తాడేపల్లిగూడెంలో సీపీవో వ్యవస్థపై అవగాహన ర్యాలీలు నిర్వహించ నున్నారు. ఇప్పటికే ఏలూరు, భీమడోలు, గణపవరం, భీమవరం, నరసాపురంలో సీపీవోల నియామకం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం, పోలవరం సబ్‌డివిజన్‌లకు ఇంకా తేదీలు ఖరారు కాలేదు.

సీపీవో ఏం చేస్తారంటే..

పోలీస్‌ విధులపై అసక్తి కలిగిన యువతీయువకులు (సీపీవో)లుగా చేరవచ్చు. వీరికి ఏ విధమైన జీతభత్యాలుండవు. నెలలో కనీసం 30 గంటలైనా పోలీస్‌ విధులకు కేటాయించాల్సి ఉంటుంది. రోజు వారీగా పోలీసులు నిర్వహించే నేరాల నియంత్రణ, సమాజంలో అసాంఘిక కార్యాకలాపాల సమాచారం అందించడం, ట్రాఫిక్‌ విధులు, బందోబస్తు,  కంప్యూటర్‌ నైపుణ్యం ఉన్న వాళ్లు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేయడం, రాత్రి గస్తీ, పోలీసు రికార్డుల నిర్వహణ తదితర పనుల నిర్వహణలో సీపీవోలు పనిచేయాల్సి ఉంటుంది. సాధారణంగా స్థానికులకే ప్రాముఖ్యత ఇస్తారు. వీరికి అవసరమైన శిక్షణ కుడా అందిస్తారు. సీపీవోలకు గుర్తింపు కార్డులందిస్తారు. సీపీవోలకు ప్రత్యేకంగా రూపొందించి యూనిఫామ్‌ ఉంటుంది. దరఖాçస్తు చేసిన అభ్యర్థుల నైపుణ్యతను బట్టి విధులు కేటాయిస్తారు. సీపీవోలుగా చేరిన వారు తమకు అనుకూలమైన సమయాల్లోనే పోలీస్‌ సేవలకు హాజరుకావచ్చు. భవిష్యత్‌లో పోలీస్‌ కావాలన్న తపన యువతీ,యువకులకు ఈ విధానం ఎంతో ఉపకరిస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top