నాటు ఇక నీటు

నాటు ఇక నీటు - Sakshi


చేయూత

► సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు

► ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం

►  ప్రత్యేక కార్యక్రమంఅమలుకు చర్యలు..




నాటు సారా తయారీ వారి జీవనాధారం.. తరచూ ఎక్సైజ్‌ అధికారుల దాడులు.. కేసులు, అరెస్టులు.. అయినా కుటుంబ పోషణ కోసం వేరేదారి లేక అదే ఊబిలో కూరుకుపోవడం.. పరిపాటిగా తయారైన వారి జీవితాలకు చేయూత నిచ్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. నాటు సారా కాయడం, విక్రయించడం జీవనోపాధిగా మార్చుకున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ వృత్తి వదిలేసి.. గొర్రెల పెంపకం, మినీ డెయిరీలు, ఆటోలు, కిరాణషాపులు, కూరగాయలు, భూమి అభివృద్ధి, టెంట్‌హౌస్‌ వంటి స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగించేందుకు తోడ్పాటునందిస్తోంది. ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేశారు.



సాక్షి, నిజామాబాద్‌: నాటు సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఎక్సైజ్‌శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 2015 సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు సుమారు నాలుగు నెలల పాటు ఎక్సైజ్‌శాఖ ఈ నాటు సారా తయారీపై దృష్టి సారించింది. పెద్ద ఎత్తున దాడులు చేయడం, కేసులు నమోదు చేసింది. ఈ మేరకు నాటు సారా రహిత జిల్లాగా జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ క్రమంలో కేసులు నమోదైన నాటుసారా తయారీదారులు, రవాణా చేసే వారు, విక్రయించిన వారు తిరిగి ఇదే ఊబిలో కూరుకుపోకుండా చూసేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించాలని నిర్ణయించింది.


ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో 170 మంది నాటు సారా కాచే వారిని, విక్రయించే వారిని ఎక్సైజ్‌శాఖ గుర్తించింది. మోర్తాడ్, భీంగల్,ఆర్మూర్‌ తదితర ప్రాంతాల వారు అధికంగా ఉన్నారు. వీరికి ఆయా కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధిని కల్పిస్తున్నారు. మొదటి విడతలో 116 మందికి గిరిజన సంక్షేమశాఖ ద్వారా స్వయం ఉపాధి పథకాలను మంజూరు చేశారు. ఇందులో 46 మందికి గొర్రెల పెంపకం యూనిట్లు, 20 మందికి మిని డెయిరీలు, 17 మంది ఆటోల ద్వారా ఉపాధి పొందేలా యూనిట్లను అందించారు. అలాగే ఏడుగురికి మేకల పెంపకం, 12 మందికి కిరాణ షాపులు, కూరగాయల వ్యాపారం, ఆరుగురికి భూమి అభివృద్ధి, ఇద్దరికి ట్రా క్టర్లు, మరొకరి టెంట్‌హౌజ్, మరో ఐదుగురికి ఇతర యూనిట్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లను మం జూరు చేశారు.


ఇందుకోసం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.2.32 కోట్లను మంజూరు చేసింది. కామారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 45 మంది నాటుసారా త యారీ, విక్రయదారులను గుర్తించారు. ఇందులో మొ దటి విడతలో 15 మంది లబ్ధిదారులకు గిరిజన సంక్షేమశాఖ నిధులతో స్వయం ఉపాధి యూనిట్లను మం జూరు చేశారు. గొర్రెల కొనుగోలు ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. అలాగే ఆటోల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. రెండో విడతలో మిగిలిన వారికి ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూ నిట్లను మంజూరు చేయనున్నారు. మూడు శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా రు. ఎక్సైజ్‌శాఖ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టగా, స్వయం ఉపాధి పథకాల మంజూరు సంబం ధించి నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు మంజూరు చేస్తాయి. ఈ యూనిట్ల కొనుగోలు, పంపిణీ వంటి ప్రక్రియ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చేపట్టింది.



ఇతర పథకాలూ లబ్ధి

కేవలం స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేయడమే కాకుండా ఇలాంటి కుటుంబాల్లోని చిన్నారులను మోడల్‌ స్కూల్, ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించడం, ఆ కుటుంబాల్లోని సభ్యులకు అర్హులైన వారికి సామాజిక పెన్షన్లు ఇప్పించడం, ఉపాధి హామీ జాబ్‌ కార్డులు మంజూరు వంటి చర్యలు చేపట్టారు.



పరివర్తన తెచ్చేందుకు..

నాటుసారా తయారీదారుల్లో పరివర్తన తెచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సారాకు అలవాటు పడిన వేలాది మంది కుటుంబాలను కూడా కాపాడినట్లవుతుంది. ఇందుకోసం ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాము. ఈ యూనిట్లను తీసుకున్న తర్వాత తిరిగి నాటుసారా వైపు వెళ్లకుండా ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతాం.

–డేవిడ్‌ రవికాంత్, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top