టీఆర్ఎస్కు ఎలిమినేటి కృష్ణారెడ్డి గుడ్‌బై?
నల్లగొండ: ‘టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు పిడికెడు మందిమి కూడా లేము..’ ఇదీ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తరచుగా చెప్పే మాట. ఆ పిడికెడు మం దిలో ఒకరిగా, పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, నల్లగొండ జిల్లాకు చెందిన క్రియాశీలక నేత ఎలిమినేటి కృష్ణారెడ్డి.. పార్టీ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుతోపాటు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి భిన్నంగా కేసీఆర్ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారనే భావనలో కృష్ణారెడ్డి ఉన్నారని సమాచారం. దీంతో ఆయన త్వరలోనే టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. ఈమేరకు కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది.