ఎం‘తాటి’ కరువో..!

ఎం‘తాటి’ కరువో..!


ఎంత కరువు వచ్చినా.. నీరు లేకపోయినా తాటి, ఈత, టెంకాయ చెట్లు పచ్చగానే ఉంటాయి. ఎంతటి వర్షాభావాన్ని అయినా తట్టుకుంటాయి.  కానీ ఈసారి పోట్లమర్రి , వేల్పుమడుగు, ముష్టూరు, రాఘవంపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల సమీపంలో ఉన్న వందలాది తాటిచెట్లు ఎండుముఖం పట్టాయి. సుమారు పదేళ్లుగా వర్షాలు సక్రమంగా కురవలేదు. వాగులు పారలేదు. దీంతో భూగర్భజలాలు అడుగంటాయి. ఫలితంగా తాటి చెట్లు ఎండిపోతున్నాయి. ఏటా వేసవిలో తాటిముంజెలు విరివిగా ఉండేవి. కానీ ఈ ఏడాది తాటిముంజెల విక్రయాలు ఎక్కువగా కనిపించలేదు. వాటిని అమ్ముకొని జీవించే అనేక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.  

- బత్తలపల్లి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top