కట్నం వేధింపులకు అబల బలి

కట్నం వేధింపులకు అబల బలి


అశోక్‌నగర్‌లో వివాహిత బలవన్మరణం

అత్తింటివారే హత్య చేశారని బంధువుల ఆరోపణ


 

సిరిసిల్ల క్రైం : కట్నం వేధింపులు అబలను బలితీసుకున్నారుు.రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని అశోక్‌నగర్‌కు చెందిన లగిశెట్టి స్వాతి అలియాస్ మాసం అక్షయ (22) ఆదివారం ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని చనిపోరుుంది. పోలీసులు కథనం ప్రకారం... పట్టణానికి చెందిన మాసం భార్కర్, లక్ష్మి దంపతుల కూతురు స్వాతిని గతేడాది ఇదే కాలనీకి చెందిన లగిశెట్టి రమేశ్, సరస్వతి దంపతుల కుమారుడు శ్రీకాంత్‌కిచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో రూ.ఐదు లక్షల కట్నంతోపాటు ఇతరు లాంఛనాలు ముట్టజెప్పారు.



మూడు నెలల తర్వాత రూ.లక్ష అదనంగా కట్నం, బంగారం తేవాలని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు స్వాతిని వేధించడం ప్రారంభించారు. ఆర్నెల్లుగా వేధింపులు అధికమయ్యారుు. ఈక్రమంలో ఒకసారి పెద్దమనుషుల సమక్షంలో పంచారుుతీ నిర్వహించి భార్యాభర్తలు కలిసి ఉండాలని సర్ది చెప్పారు. తర్వాత శ్రీకాంత్ కుటుంబ సభ్యుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ విషయాలను ఎదురింట్లోనే ఉండే తల్లిందండ్రులకు బాధితురాలు చెప్పింది. ఈక్రమంలో వేధింపులు తాళలేక స్వాతి ఆదివారం మధ్యాహ్నం ఉరివేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టింది.



హత్య చేశారని బంధువుల ఆగ్రహం

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానించడం, అదనపు కట్నం కోసం వేధిచడంతోనే స్వాతి మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆగ్రహంతో లగిశెట్టి శ్రీకాంత్ ఇంటిపై దాడికి యత్నించారు. అప్పటికే తాళం వేసి శ్రీకాంత్ కుటుంబసభ్యులు పరారయ్యారు. గేట్ తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిన ఆందోళనకారులు.. ఇంట్లో వాతావరణం ఆత్మహత్య చేసుకున్నట్లు లేదని, హత్య చేసినట్లు ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పటికే పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని శాంతింపజేశారు. స్వాతి తండ్రి ఫిర్యాదు మేరకు స్వాతి భర్త శ్రీకాంత్, మామ రమేశ్, అత్త సరస్వతిపై టౌన్ సీఐ విజయ్‌కుమార్ కేసు నమోదు  చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top