యోగాతో రోగాలు దూరం

యోగాతో రోగాలు దూరం


∙ మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు

∙ సంపూర్ణ ఆరోగ్యం.. జీవిత కాలం పెంపు

∙ పాఠశాలస్థాయి నుంచి అలవరచుకోవాలి




మెదక్‌ మున్సిపాలిటీ: పట్టణంలోని సిద్ధార్థ్‌ విద్యాసంస్థల్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా చైర్మన్‌ శ్రీనివాస్‌చౌదరి మాట్లాడుతూ యోగ గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రతినిత్యం యోగా చేయడం ద్వారా ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. చక్కటి ఆరోగ్యం కోసం యోగాసనాలు వేయాలని ప్రిన్సిపల్‌ సంధ్యారాణి విద్యార్థులకు సూచించారు.  



మెదక్‌రూరల్‌: యోగాసనాలు వేయడంతో మానసిక ఒత్తిడి..శారీరక శ్రమను అధిగమించవచ్చని రిటైర్డ్‌ ఇంజనీర్‌ మురహరిరావు సూచించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం మెదక్‌ మండలంలోని మాచవరం, చిట్యాల తదితర ప్రభుత్వ పాఠశాలల్లో యోగా డే నిర్వహించారు.  మండల పరిధిలోని మాచవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు సుధాకర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అదే గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి, రిటైర్డ్‌ ఇంజనీర్‌ మురహరిరావు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో మానసిక ఒత్తిడి, శారీరక శ్రమను తగ్గించుకోవడానికి యోగాసనాలు వేయడం ఒక్కటే మార్గమన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వలన పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు కీడలు, యోగాలోకూడా ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. యోగా నేర్చుకునే విద్యార్థులకు టీషర్ట్‌లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహరావు, సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులున్నారు.



టేక్మాల్‌(మెదక్‌): మండలంలో అంతర్జాతీయ యోగా డేని బుధవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులచే పలు ఆసనాలు వేయిస్తూ యోగా ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. మండల కేంద్రమైన టేక్మాల్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు వయాగ్రాసం, బకాసన్, సేతుబంద చక్రాసనం, ఎకపాద చక్రాసనం, ద్విపాద వృశ్చికాసనం, భూమాసనం వంటి ఆసనాలు వేయించారు. శారీరక, మానసిన ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని హెచ్‌ఎం మిజ్‌బా విద్యార్థులకు సూచించారు.



రామాయంపేట(మెదక్‌ ): మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మంజీరా విద్యాలయంలో జరిగిన  కార్యక్రమంలో యోగా శిక్షకుడు రవీజీ విద్యార్థులకు, స్థానికులకు యోగాలో శిక్షణ ఇచ్చారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో సీఐ వెంటక్‌రెడ్డి, పతంజలి ఆరోగ్య కేంద్రం నిర్వాహకులు కైరంకొండ తిరుపతి, శిక్షకులు నరేశ్, భరత్, ప్రవీణ్, ప్రిన్సిపాల్‌ జితేందర్‌రెడ్డి, డైరెక్టర్‌ రామచందర్‌గౌడ్, ప్రిన్సిపాల్‌ సురేశ్,  స్వాభిమాన్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు రాజశేఖర్‌రెడ్డి, సంగమేశ్వర్,  దేమె భూమయ్య, ముత్యాలు, పండరినాధ్‌ పాల్గొన్నారు. రామాయంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సత్యనారాయణరెడ్డి, లెక్చరర్లు బాలప్రకాశ్, అరుణ, యతి రాజవల్లి, వెంటకలీలావతి, శ్రీనివాస్, మల్లేశం, అశోక్, శ్రీదేవి పాల్గొన్నారు.  అలాగే అక్కన్నపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో హెచ్‌ఎం శ్రీనివాస్, ఇతర పాధ్యాయులు పాల్గొన్నారు.



నిజాంపేట(మెదక్‌): మండలంలోని కల్వకుంట ఉన్నత పాఠశాలలో జరిగిన యోగా కార్యక్రమంలో శిక్షకుడు భరత్, హెచ్‌ఎం పద్మజ, టీచర్లు రామ్మోహన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



పాపన్నపేట(మెదక్‌): మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్శహించారు. చీకోడ్‌  ప్రాథమిక పాఠశాలలో యోగా ఆకృతిలో కూర్చున్న విద్యార్థులు యోగా విన్యాసాల్ని ప్రదర్శించారు. అలాగే పొడిచన్‌పల్లి, అబ్లాపూర్, నార్సింగి, ఎల్లాపూర్, శానాయిపల్లి పాఠశాలల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కిషన్, అంజనాచారి, ఢాక్యా, జ్యోతి, దుర్గాగౌడ్, లక్ష్మీనారాయణ, సంధ్యారాణి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.



హవేళిఘణాపూర్‌(మెదక్‌): హవేళిఘణాపూర్‌ ఉన్నత పాఠశాల, ఔరంగాబాద్‌ తండా ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపాల్‌  ఉపాధ్యాయులు వైద్య శ్రీనివాస్, వసంత్‌కుమార్, రాజశేఖర్‌ తదితరులున్నారు.



అల్లాదుర్గం(మెదక్‌): మండల పరిధిలోని చిల్వెర, అల్లాదుర్గం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం యోగా దినోత్సవం జరుపుకున్నారు. యోగా చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటారని చిల్వెర పాఠశాల హెచ్‌ఎం కందర్ప చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు కచుర్‌రావ్, జానార్ధన్, ఎన్‌సీసీ అధికారి మహేశ్, సవిత తదితరులు పాల్గొన్నారు.



పెద్దశంకరంపేట(మెదక్‌) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు యోగాపై అవగాహన కల్పించారు. దీంతో పాటు పేటలోని రామాలయం, చీలాపల్లిలో యోగాగురువు లక్ష్మీనారాయణ యోగాసనాలపై వివరించారు. కార్యక్రమంలో యోగా అభ్యాసకులు, ఉపాద్యాయులున్నారు.



చిన్నశంకరంపేట(మెదక్‌):  యోగాతో శారీరక దారుఢ్యంతోపాటు మానసిక శక్తిని పొందవచ్చని చిన్నశంకరంపేట ప్రభుత్వ కళశాల ప్రిన్సిపాల్‌ డి.నాగేందర్‌ పేర్కొన్నారు. బుధవారం చిన్నశంకరంపేట ప్రభుత్వ కళశాలలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగాసనాలు వేశారు.  ఈ కార్యక్రమంలో మోడల్‌ స్కూల్‌ హెచ్‌ఎం రమేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top