ప్రపంచ బ్యాంకు నిధులతో ఆస్పత్రుల అభివృద్ధి

ప్రపంచ బ్యాంకు నిధులతో ఆస్పత్రుల అభివృద్ధి


హిందూపురం అర్బన్‌ : ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి కేబినెట్‌ ఆమోదించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు అన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. అలాగే ఆసుపత్రిలో ఆవరణలో అన్న క్యాంటిన్, మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వారితోపాటు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఎంపీ నిమ్మల కిష్టప్ప, కలెక్టర్‌ కోన శశిధర్, వైద్య విధాన పరిషత్‌ చైర్మన్‌ బీకేనాయక్‌  హాజరయ్యారు.



ఈసందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి కామినేని శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రసుత్తం హిందూపురంలో ప్రారంభించామన్నారు. అలాగే ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచామన్నారు. తద్వారా మాతా శిశు మరణాలు నివారించామన్నారు. ఓపీ కూడా 28 శాతం పెరిగిందన్నారు.  హిందూపురం ఆసుపత్రికి శనివారం అనస్థీషియన్‌ను నియమిస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ  బాలకృష్ణ వచ్చిన తర్వాతే హిందూపురం అభివృద్ధి జరుగుతోందన్నారు. శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించాలని బాలకృష్ణను కోరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ బెంగళూరు రాయయ్య ఆసుపత్రిలో ఆరోగ్యసేవ సదుపాయం అందించడానికి చర్చిస్తున్నామన్నారు.   కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ లక్ష్మి,  బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ రంగనాయకులు, ఆసుపత్రి కమిటీ చైర్మన్‌ వెంకటస్వామి పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top