ప్రోత్సాహంతో పాటు టాలెంట్ అవసరం

ప్రోత్సాహంతో పాటు టాలెంట్ అవసరం - Sakshi


వర్థమాన నటుడు ధీరేంద్ర

 

విశాఖపట్నం : సినిమా రంగంలో ప్రోత్సాహంతో పాటు టాలెంట్ అవసరమని వర్థమాన నటుడు ధీరేంద్ర అన్నారు. చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టమని, పాఠశాల, కళాశాలలో చదివే సమయంలో 50 వరకు స్టేజ్ ప్రోగ్రామ్‌లు చేశానని చెప్పారు. ఈ క్రమంలో ‘రెడ్ అలర్ట్’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చిందని తెలిపారు. మంగళవారం షీలానగర్‌లో ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో తన అనుభవాల్ని పంచుకున్నారు.

 

ప్రశ్న: మీ స్వస్థలం ఎక్కడ, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది.?

జవాబు: మాది తిరుపతి, సినీ నటుడు మోహన్‌బాబు గారి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో బీటెక్, ఎంబీఏ పూర్తి చేశాను. మా నాన్న గారి ఉద్యోగి రీత్యా విశాఖలోని సిరిపురంలో మూడేళ్లగా ఉంటున్నాం.

 

ప్రశ్న: సినిమా రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు?

జ: చిన్నప్పటి నుంచి నటన అంటే అమితమైన ఇష్టం. చిత్ర పరిశ్రమలో ప్రవేశించి హీరోగా ఎదగాలని ఉండేది. పాఠశాల, కళాశాలల్లో చదివే సమయంలో చాలా నటకాలు వేశాను. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను. మోహన్‌బాబు గారి చేతులమీదుగా బహుమతులు అందుకున్నాను.

 

ప్రశ్న: సినిమా రంగంలోకి మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు?

జ: మోహన్‌బాబు గారు. ఆయన డైలాగ్ డెలివరి బాగుంటుంది.

 

ప్రశ్న: ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు? ఏయే భాషల్లో నటిస్తున్నారు ?

జ: తెలుగులో మూడు సినిమాలు చేశాను. రెడ్ అలర్డ్ రిలీజ్ అయ్యింది. కలి సినిమా పూర్తి కావచ్చింది. మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను.  

 

ప్రశ్న: ఎవరి వద్దయినా శిక్షణ తీసుకున్నారా?

జ: మొదట్లో అనుపమ కేర్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందాను. విశాఖ వచ్చిన తరువాత స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద చేరాను. ఆ సమయంలోనే సినిమా అవకాశాలు వచ్చాయి.

 

ప్రశ్న: విశాఖ నగరంతో అనుబంధం?

జ: విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. నగరాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అన్ని ప్రదేశాలను చుట్టేశాను. విశాఖలో చిత్ర పరిశ్రమకు కావల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top