గుండెల్లో లబ్‌డబ్బు

గుండెల్లో  లబ్‌డబ్బు - Sakshi


చాలామందికి బ్యాంకు అకౌంట్లు లేవు. ఉన్నవారికి రూపే, ఏటీఎం కార్డుల్లేవు. అరుునా సరే.. పాలకులు నగదు రహిత లావాదేవీలంటున్నారు. డిసెంబర్ ఒకటి నుంచే శ్రీకారం చుడతామంటున్నారు. అందరూ అకౌంట్లు తెరవాల్సిందే.. కార్డులు తీసుకోవాల్సిందేనని పీక మీద కత్తి పెడుతున్నారు. అకౌంట్లు తెరిచేదెప్పుడు.. కార్డులు పొందేదెప్పుడు.. పింఛన్లు దక్కేదెప్పుడని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.మరోవైపు కరెన్సీ సంక్షోభం పాడి రైతులను ఎటూ పాలుపోనీయకుండా చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత గత కొన్నాళ్లుగా డెరుురీ నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితులన్నింటిపై ఫోకస్..



పెద్దనోట్ల రద్దు దెబ్బకు ఒక్క నవంబర్‌లోనే ఊహించని రీతిలో పింఛన్‌దారుల్లో కోతపడింది. గడిచిన మూడు నెలల్లో మంజూరైన పింఛన్లను పరిశీలిస్తేఈవిషయం స్పష్టమవుతోంది. సెప్టెంబర్‌లో 3,25,008 మందికి మంజూరు చేస్తే, ఆ సంఖ్య అక్టోబర్‌లో 3,24,259కు తగ్గింది. ఇక నవంబర్‌లో పెద్దనోట్ల దెబ్బకు కేవలం 3,02,737 మందికి మాత్రమే పంపిణీ చేయ గలిగారు. ఇక డిసెంబర్‌లో పరిస్థితి ఎలాఉంటుందో ఎంతమందికి పింఛన్లు అందు తాయో చెప్పలేని గందర గోళ పరిస్థితులు నెలకొన్నారుు. సాధారణంగా జిల్లాలో ఉన్న పింఛన్ దారుల సంఖ్యను బట్టి ప్రతినెలా రూ.35.06కోట్ల ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 15వ తేదీ కల్లా వీటిని నగదు రూపంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంటారు. వచ్చే నెల నుంచి పింఛన్ సొమ్మును వారి ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.



జిల్లాలో 3.24లక్షల పింఛన్ దారుల్లో ఆధార్‌సీడింగ్ జరిగిన అకౌంట్స్ కలిగిన వారి సంఖ్య కేవలం 2,04,184 మంది మాత్రమే ఉన్నారు. మరో 71,575 మందికి అకౌంట్స్‌ఉన్నప్పటికీ ఇంకా ఆధార్ సీడింగ్ కాలేదు. మరో46,149 మందికి అసలు అకౌంట్సే లేవు. పోనీ ఆధార్, అకౌంట్ సీడింగ్ కలిగిన 2,04,184 మందికై నా నేరుగా వారి ఖాతాల్లో పించన్ సొమ్ము జమ చేద్దామన్నా వారెవరికి రూపేకార్డుల్లేవు. మొత్తం పింఛన్‌దారుల్లో రూపే కార్డులుకలిగిన వారు కేవలం 528 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 2,85,231 మందికి రూపేకార్డుల పంపిణీ చేయాల్సి ఉంది. వీటిని పంపిణీ చేయాలన్నా కనీసం రెండు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన డిసెంబర్ నెలకు పింఛన్ సొమ్ము  బ్యాంకు ఖాతాలో జమ చేసే పరిస్థితులు ఏమాత్రం కన్పించడం లేదు. దీంతో పాతపద్ధతిన నగదు రూపంలోనే ఇవ్వాలి. పింఛన్ల పంపిణీలో కీలకమైన రూ.500లు, రూ.వెరుు్య నోట్లు రద్దు కావడంతో  పరిస్థితి జటిలంగా మారింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top