కనీస వేతనం రూ.10వేలు చెల్లించాలి


కనీస వేతనం రూ.10వేలు చెల్లించాలి, demand for minimum wages

కార్మికులు, కనీస వేతనం, రూ.10 వేలు

labour, minimum wages

అచ్యుతాపురం: బ్రాండెక్స్‌ కార్మికుల జీతాలను రూ.పదివేలకు పెంచుతామని మాటఇచ్చి మోసం చేశారని.. కనీస వేతనం రూ.10 వేలు చేయాల్సిందేనని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌.రమేష్‌ అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 15 రోజుల పాటు బ్రాండెక్స్‌ మహిళలు ఉద్యమం చేస్తే అఖిలపక్షం నాయకులు, జిల్లా అధికారుల సమక్షంలో  కనీస వేతనం రూ.10వేలు అందిస్తామని కార్మికులకు రాతపూర్వక ఒప్పందం కుదిరిందన్నారు. వేతన సవరణ చేపట్టడానికి సమయం పడుతుంది కాబట్టి విధులకు హాజరుకావాలని కోరడంతో అప్పట్లో కార్మికులు విధులకు హాజరయ్యారన్నారు. కొత్త వేతన సవరణ చట్టం ప్రకారం కార్మికులకు రూ.18వేలు కనీస వేతనం అమలుకావాలసి ఉందన్నారు. కనీసవేతన సవరణ చట్టాలపై అవగాహన లేకుండా ముఖ్యమంత్రి వెయ్యిరూపాయలు పెంచమనడం విడ్డూరంగా ఉందన్నారు. బ్రాండెక్స్‌లో శ్రమదోపిడీకి ఆయనే లైసెన్స్‌ ఇచ్చినట్టు అయ్యిందని ఎద్దేవాచేశారు. కనీస వేతనం పదివేలరూపాయలు ఇవ్వకుంటే ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తాయని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు రొంగలి రాము, కూండ్రపుస్వామినాయుడు, బుద్ధ రంగారావు పాల్గొన్నారు. 

 

Election 2024

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top