ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో    ప్రసవాలు పెరగాలి - Sakshi


గ్రామస్తుల్ అవగాహన పెంచితేనే ఇది సాధ్యం

{పతీ రోజు పీహెచ్‌సీల వివరాలు పంపించాలి

కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్


వరంగల్ రూరల్ : ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించడం ద్వారా తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉంటారనే అంశంపై గ్రామస్తుల్లో అవగాహన కల్పించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హన్మకొండలోని కలెక్టరేట్ నుంచి ఆయన జిల్లాలోని పీహెచ్‌సీల వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లతో వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా మాట్లాడారు. వరంగల్ రూరల్ జిల్లాలో 17 పీహెచ్‌సీలు ఉండగా ఇందులో ఆరింట్లో ఇరవై నాలుగు గంటల సేవలు అందించేవి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని సూచించారు. ఒక్కో ఏఎన్‌ఎం నెలకు రెండు నుంచి మూడు ప్రసూతి కేసులు తీసుకురావాలన్నారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిబంధనల ప్రకారం నెలకు పది ప్రసవాలు కావాల్సి ఉన్నా ఒక్కో ఆస్పత్రిలో కనీసం ఐదు ప్రసవాలైనా చేయాలని ఆదేశించారు. అలాగే, ఇక నుంచి పీహెచ్‌సీల వారీగా ప్రసవాల కేసుల వివరాలను తనకు పంపించాలని స్పష్టం చేశారు.


 సౌకర్యాలు సమకూర్చుకోవాలి

ఆస్పత్రుల్లో పూర్తిస్థారుు మౌళిక సదుపాయాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. పడకలు, స్ట్రెచర్లు, బెడ్ షీట్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ ఉండేలా చూడడంతో పాటు ఆవరణలో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు పెంచాలన్నారు. ఇందుకోసం ఆస్పత్రి అభివృద్ధి నిధులు వినియోగించుకోవచ్చని తెలిపారు. అలాగే, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇంకా వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావాలని ఆదేశించారు. తల్లీబిడ్డలు దోమల బారిన పడకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. దోమల నివారణలో భాగంగా ఆస్పత్రుల్లోని పాడైపోరుున పరికరాలు, ఫర్నీచర్‌ను వేలం వేయాలని కలెక్టర్ పాటిల్ సూచించారు. కాగా, హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్న వారికి మంచి వైద్యం అందించాలని, వచ్చే నెల 1న ఎరుుడ్‌‌స డే ఉన్నందున మండల స్థారుులో ర్యాలీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.


సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలి : డీఎంహెచ్‌ఓ

సీజనల్  వ్యాధులను అరికట్టడంపై వైద్యులు, సిబ్బంది దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ అశోక్ ఆనంద్ సూచించారు. స్వైన్‌ఫ్లూ, జ్వరాలతో బాధపడేవారిని గుర్తించి వైద్యసేవలు అందించాలన్నారు. జనవరిలో నిర్వహించే పల్స్ పోలియో విజయవంతానికి ఇప్పటి నుంచే 0-5 ఏళ్ల లోపు పిల్లల వివరాలు సేకరించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్‌‌సలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ అనురాధ, హెచ్‌ఈఎం కె.విద్యాసాగర్, ఆర్‌ఎంఓలు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top