సహకారం ఎలా?

సహకారం ఎలా?


ఆర్‌బీఐ నిర్ణయంతో డీసీసీబీ ఉక్కిరిబిక్కిరి

రూ.500, రూ.వెరుు్య నోట్లు డీసీసీబీలో చెల్లుబాటు కావంటూ ఉత్తర్వులు

ఇప్పటికే లావాదేవీలన్నీ నిలిపేసిన బ్యాంక్

డీసీసీబీలో పాతనోట్ల రద్దుతో1.35 లక్షల మంది రైతులకు ఇబ్బంది

నాలుగు రోజుల వ్యవధిలో రూ.42 కోట్లు డిపాజిట్లు

యాసంగి రుణాలపై కమ్ముకున్న నీలినీడలు

ఇప్పటివరకు యాసంగి రుణాలు కేవలం రూ.6కోట్లు మాత్రమే విడుదల


సహకారబ్యాంకులకు పెద్ద కష్టాలే వచ్చిపడ్డారుు. వీటిలో పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిని రద్దు చేస్తూ రిజర్వ్‌బ్యాంక్  మంగళవారం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇది వ్యవసాయ సీజన్. రుణాలు చెల్లింపులు, జమచేసే సమయం. అరుుతే పెద్దనోట్లు తీసుకోవద్దని చెప్పడం..కొత్తవారికి రుణాలు ఇవ్వాల్సి ఉండడంతో ఏమి చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. మోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత నాలుగు రోజుల వ్యవధిలో సహకారబ్యాంకుల్లో రూ.42 కోట్లు రికవరీ కావడం, చెల్లింపులన్నీ పెద్దనోట్లతో చేయడం గమనార్హం.


సాక్షి, మహబూబ్‌నగర్ : రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇచ్చిన షాక్‌తో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లు ఉక్కిరిబిక్కిరవుతున్నారుు. పాత రూ.500, వె రుు్య నోట్ల మార్పిడిని నిలిపేస్తూ ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. దీంతో జిల్లాలోని డీసీసీ బ్యాంకులు షాక్‌కు గురయ్యా రుు. పాతనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన తర్వాత అన్ని బ్యాంకుల మాదిరి గానే డీసీసీబీలు కూడా పెద్ద నోట్లను స్వీకరించారుు. కానీ డీసీసీబీ పాలక మండళ్లన్నీ రాజకీయ పార్టీలకు చెందిన వారి చేతుల్లో ఉండడంతో కేంద్రం కఠి న చర్యలు తీసుకుంది. బ్లాక్‌మనీ ఈ బ్యాంకుల్లోని రైతు ఖాతాల ద్వారా వైట్ మనీగా మార్చుకునే అవకాశం ఉందనే అనుమానంతో పెద్దనోట్లను నిషేధిం చింది.


రూ.500,వెరుు్యనోట్లు డీసీసీబీలో చెల్లుబాటు కావం టూ రిజర్వుబ్యాంకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాలుగు రోజులుగా స్వీకరించిన పెద్దనోట్లను డీసీసీ బ్యాంకులు నిరాకరిస్తున్నారుు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 20బ్రాంచీల ఆధ్వర్యంలోని 77ప్రాథమిక సహకా ర బ్యాంకుల సేవలు నిలిచిపోయారుు. నాలుగురోజుల వ్యవధిలోనే రూ.42కో ట్ల రుణాలను రికవరీ చేశారుు. ఆర్బీఐ చర్యల కారణంగా బుధవారం నాలుగు జిల్లాల పరిధిలోని డీసీసీ బ్యాంకుల న్నీ ఖాతాదారులు లేక వెలవెలబోయారుు.


రుణాల రికవరీ ఎలా?

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని 20శాఖల డీసీసీబీల పరిధిలో మొత్తం 1.35లక్షల మంది రైతులకు ఖాతాలున్నారుు. వీరికి వానాకాలం సీజన్‌కు సంబంధించి రూ.300కోట్ల రుణాలు టార్గెట్‌గా పెట్టుకొని రూ.291కోట్ల రుణాలు ఇచ్చారుు. సీజన్ పంటలు ఇప్పుడిప్పుడే రైతుల చేతికి రావడంతో తీసుకున్న అప్పులు చెల్లించి, తిరిగిలోన్ల రెన్యువల్ చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా నెలరోజుల కాలంగా ఖాతాదారులు తమ రుణాలను రెన్యువల్ చేసుకుంటున్నారు. వారం క్రితం ప్రధాని నరేంద్రమోది పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటించారు. దీంతో పాత నోట్లు కేవలం బ్యాంకుల్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొనడంతో సహకార బ్యాంకుల రుణాల రికవరీలో వేగం పెరిగింది.


కేవలం నాలుగురోజుల్లోనే రూ.42కోట్లు వసూలయ్యారుు. కానీ మంగళవారం ఆర్బీఐ వెలువరించిన ఉత్తర్వులతో లావాదేవీలన్నీ నిలిపేసింది. పెద్ద నోట్లతో రుణాలను చెల్లించేందుకు వస్తున్న రైతులు అధికారుల సమాధానంతో తిరిగి వెళ్లిపోతున్నారు. ఆర్బీఐ చర్యల కారణంగా రుణాల రికవరీ నిలిచిపోవడంతో బ్యాంకు పాలకమండళ్లు, అధికారులు నిట్టూరుస్తున్నా రు. అదేవిధంగా యాసంగి సీజన్‌కు సంబంధించి రుణాల విడుదలపై నీలినీడలు కమ్ముకున్నారుు. వాన కా లం సీజన్‌లోరుణాలు రెన్యువల్ చేస్తే... యాసంగి రుణాలు విడుదల చేసేం దుకు అధికారులు అన్నిరకాల చర్యలు చేపట్టారు. అందుకు అనుగుణంగా ఇప్పటివరకు రూ.6కోట్ల రుణాలను విడుదల చేశారు. కానీ 77 ప్రాథమిక సహకార బ్యాంకుల పరిధిలో రూ.290కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా.. అది నెరవేరే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top