దండేపల్లి యువకుడికి 'డైకిన్'లో భారీ ప్యాకేజీ
దండేపల్లి: జపాన్‌లోని డైకిన్ కంపెనీలో ఐఐటీ మెకానికల్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి పంచాయతీ పరిధిలోని కర్ణపేటకు చెందిన అజ్మేరా సంకేత్‌కుమార్ ఎంపికయ్యాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన క్యాంపస్ సెలక్షన్లో 20 మందిని ఇంటర్వ్యూకు పిలవగా, భారత్ నుంచి మెకానికల్ విభాగంలో సంకేత్‌కుమార్ ఒక్కడే ఎంపిక కావడం విశేషం.
సంకేత్‌కుమార్ ప్రస్తుతం ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో మెకానికల్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే.. వచ్చే ఏడాది మే, జూన్‌లో కంపెనీ రెండు నెలల శిక్షణ అనంతరం ఏడాదికి రూ.30 లక్షల వేతనంతో ఉద్యోగంలో చేరనున్నట్లు సంకేత్‌కుమార్ తెలిపాడు. తండ్రి ప్రేమ్‌సింగ్ ఉద్యానవన శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.