ఆ ‘రజత’ ప్రస్థానంలో రావులపాలెం ఓ మజిలీ

ఆ ‘రజత’ ప్రస్థానంలో రావులపాలెం ఓ మజిలీ

  •  సీఆర్‌సీలో పలు టోర్నమెంట్లలో సత్తా చాటిన పీవీ సింధు

  • 2009లో రాష్ట్రస్థాయి సింగిల్స్, డబుల్స్‌లో గెలిచిన తెలుగు తేజం

  • అనంతరం పలు అంతర్జాతీయ పోటీల్లోనూ విజయాలు

  •  

    రావులపాలెం : 

    రియో ఒలింపిక్స్‌లో దేశానికి రజత పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధు క్రీడా ప్రస్థానంలో కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఓ ముఖ్యమైన మజిలీ  అని చెప్పవచ్చు. జాతీయస్థాయి ప్రమాణాలతో ఇక్కడి కాస్మోపాలిటన్‌ రిక్రియేషన్‌ క్లబ్‌( సీఆర్‌సీ)లో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో ఎన్నోఏళ్ళుగా పలు రాష్ట్ర, జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించారు. పలు టోర్నమెంట్లలో సింధు 14–15 ఏళ్ళ ప్రాయంలోనే పాల్గొని విజయదుందు«భి మోగించింది. ముఖ్యంగా 2009  ఆగస్టులో రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్‌ కం టోర్నమెంట్‌లో ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలో దిగిన సింధు సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో విజయం సాధించింది. జాతీయస్థాయ పోటీలకు ఎంపికైంది. అప్పటికే పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె తన ఆటతీరుతోప్రత్యర్థులను హడలెత్తించింది. ఆ ఏడాది జాతీయస్థాయిలో జరిగిన వివిధ టోర్నమెంట్లలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి జాతీయస్థాయిలోనూ గుర్తింపు పొందింది. తర్వాత పలు అంతర్జాతీయ పోటీల్లో సైతం ఎన్నో విజయాలు అందుకుంది. 

    సింధు సీఆర్‌సీలో ఆడటం గర్వకారణం


    రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సా«ధించి దేశానికి ఖ్యాతి తెచ్చిన సిం««దlుసీఆర్‌సీ ఇండోర్‌స్టేడియంలో పలు టోర్నమెంట్లు ఆడటం మాకెంతో గర్వకారణం.చిన్న వయసు నుంచి చూపిన ప్రతిభే నేడు ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టింది.సింధు వంటి క్రీడాకారిణులు అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో సీఆర్‌సీలో నిర్వహించిన పోటీలు ఎంతగానో ఉపకరించాయి.


    – నందం సత్యనారాయణ, సీఆర్‌సీ అధ్యక్షుడు


    సింధుకు మరింత ఉజ్వల భవిష్యత్తు


    ఎంతో కృషితో రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధంచిన సింధు దేశానికి ఎంతో గర్వకారణం. ఏపీబీఏ ఉపాధ్యక్షుడిగా పలు టోర్నమెంట్లలో సింధు ఆటను దగ్గరగాచూశాను. ఆమెతో కలసి ఇండియా జట్టు మేనేజర్‌గా ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌కు వెళ్లాను. సింధుకు మరింత ఉజ్వల భవిష్యత్‌ ఉంది. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.    


    – తేతలి నారాయణరెడ్డి, ఏపీబీఏ ఉపాధ్యక్షుడు 


     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top