శంకుస్థాపనకు ఖర్చెంత?

శంకుస్థాపనకు ఖర్చెంత? - Sakshi


ఆంధ్రప్రదేశ్ బ్యూరో, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని హంగూ ఆర్భాటాలతో  నిర్వహిస్తుండడంపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. తాము కోరిన వివరణకు సాధ్యమైనంత త్వరగా స్పందించాలని సూచించింది. ఈ నెల 22న అమరావతి  శంకుస్థాపన కార్యక్రమాన్ని రూ.వందల కోట్ల ఖర్చుతో నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై పీఎంఓ  దృష్టి సారించింది.



ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వినియోగం, ప్రచారానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుండటంపై సమగ్ర సమాచారం పంపాలని ఏపీ ప్రభుత్వాన్ని పీఎంఓ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవైపు లోటు బడ్జెట్‌లో ఉన్నామంటూనే మరోవైపు రూ.కోట్లు ఖర్చు చే యడాన్ని కూడా పీఎంఓ ప్రస్తావించినట్లు తెలిసింది. శంకుస్థాపనకు ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలని పేర్కొన్నట్లు సమాచారం.



 రాష్ట్ర సర్కారు తీరుపై పీఎంఓ అసంతృప్తి  

 రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించిన ఈ-బ్రిక్స్ పోర్టల్‌ను ముందుగా ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిం దో వివరణ ఇవ్వాలని పీఎంఓ పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయి. సింగపూర్, జపాన్ ప్రధానులను ప్రొటోకాల్ కు విరుద్ధంగా ఆహ్వానించడంపై కూడా పీఎంఓ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.  



 భూమిపూజ పూర్తయినా ఆర్భాటం

 రాష్ర్ట రాజధాని నిర్మాణ భూమి పూజ, శంకుస్థాపనకు మధ్య తేడా ఏమిటో వివరించాలని పీఎంఓ ఏపీ సీఎం కార్యాలయాన్ని కోరింది. జూన్ 6న సీఎం  గుంటూరు జిల్లా మందడం గ్రామ సమీపంలో రాజధాని నిర్మాణానికి భూ మి పూజ చేశారు. దీని తరువాత  నిర్మాణ పను లను ప్రారంభిస్తారు. భూమిపూజ రోజునే ము ఖ్యులను ఆహ్వానిస్తారు. పనుల ప్రారం భం రోజున ఎలాంటి ఆర్భాటాలు ఉండవు.  భూమిపూజ చేసిన నాలుగున్నర నెలల తరువాత సీఎం శంకుస్థాపన పేరుతో హడావిడి చేస్తున్నారు. దీంతో పీఎంవో రెండింటికి మధ్య ఉన్న తేడా వివరించాలని కోరినట్లు తెలిసింది. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top