ఆ సంతకం అవినీతికి అంకితం


  • దే‘వాదాయం’’లో చంద్రుడు   

  • రిటైర్‌మెంట్‌ చివర్లోనూ పీక్కుతినడమే

  •  

    పదవీవిరమణ అంటే అదో పండుగ ... ఆ ఉద్యోగితో ఉండే అనుబంధం ... సహచరులుగా వేసిన అడుగులు ... ఆయన చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ సాగిన ప్రసంగాల వేదిక. సిబ్బంది ప్రశంసలు ... ముంచెత్తిన  పూలమాలలు ... సన్మాన దుశ్శాలువాల ఆత్మీయ స్పర్శతో పులకించిపోవాలి. ఇంతకుమంచి సిబ్బందితో కలిసి పనిచేయలేకపోతున్నానంటూ ఆ ఉద్యోగి గొంతు బాధతో గద్గద స్వరంగా మారిపోవాలి. కానీ దీనికి భిన్నంగా పవిత్ర శాఖ దేవాదాయ శాఖలో ఉన్నతాధికారిగా పని చేసి పదవీ విరమణ చేస్తున్న ఆ ఉద్యోగి ‘ఆదాయ వనరు వేదిక’గా మలుచుకుంటున్నాడు.  

     

    సాక్షి ప్రతినిధి, కాకినాడ :

    దేవాదాయశాఖలో తిష్టవేసిన తిమింగలాన్ని చూసి దిగువ క్యాడరంతా బేజారెత్తి పోతున్నారు.  ఆయన ప్రతి సంతకం అవినీతికి అంకితం అన్నట్టుగా సాగింది. ఆరు దశాబ్థాలు దేవాదాయ అధికారిగా  పనిచేసినంత కాలం ఉద్యోగులను జలగల్లా పీక్కుతిన్నాడు.చివర్లో పీఠాన్ని విడిచిపెట్టే సందర్భాన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నారు. ‘రిటైర్‌ అయిపోతున్నాను బహుమతులు ఇచ్చుకోవాలని’ తలకో రేటు పెట్టి   

    ‘లకా’రాలకు ‘లకా’రాలే లాంగిసేస్తున్నాడు. గడచిన పక్షం రోజులుగా అసలు పనులు మానేసి కొసరు కోసం కక్కుర్తిపడే పనిలో ఉన్నాడాయన. దేవాదాయశాఖ కాకినాడ ప్రాంతీయ కార్యాలయంలో తిష్ట వేసిన ఆ తిమింగలం ఐదు రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈలోపు ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా పీక్కుతింటోంది. ఆ తిమింగలం బారి నుంచి మిగిలిన ఆ ఐదు రోజులు ఎలా గట్టెక్కుతాము దేవుడా అంటూ దిగువ క్యాడర్‌ అధికారులు, ఉద్యోగులు హడలిపోతున్నారు. కొందరైతే డీసీ కార్యాలయం దరిదాపుల్లోకి రావడానికి కూడా వెనుకంజవేస్తున్నారు. రిటైరయ్యే సంబంధితాధికారి తన వద్దకు పనిమీద వచ్చిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టడం లేదు. 2013లో జిల్లా కేంద్రం కాకినాడ డీసీ కార్యాలయానికి వచ్చిన ఆ  ఉన్నతాధికారి ఇక్కడ రెండేళ్లు పని చేశారు.అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి బదిలీపై వెళ్లారు. పది నెలలు అక్కడ పనిచేసి రిటైర్‌మెంట్‌ సమయంలో జిల్లాపై మమకారం చంపుకోలేక గత ఫిబ్రవరిలో తిరిగి వచ్చేశారు. త్వరలో రిటైర్‌ కానున్నారు. 

     

    చేసిన పనులు గుర్తు చేస్తూ రేటు ఫిక్స్‌...

    ఫలానా అçప్పుడు ఈ పనిచేసి పెట్టాను ఇప్పుడు రిటైరైపోతున్న సందర్భంగా ఏదో ఒక నజారానా ఇచ్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలున్నాయి. అసిస్టెంట్‌ హోదా కలిగిన ఆలయాలు, సత్రాల్లో గ్రేడ్‌–1 ఈఓలుగా (ఎఫ్‌ఎసీ) పూర్తి అదనపు బాధ్యతలతో నియమించి అందినంతా మూటగట్టుకున్నారు. ఇటీవల జిల్లాలో ఆరుగురు ఇ¯ŒSఛార్జీలకు ఆర్థికంగా పరిపుష్టి కలిగిన ఆలయాలను కట్టబెట్టారు. అందుకు  50 వేల  నుంచి లక్షన్నర వరకు మూటగట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల సాధారణ బదిలీలను దాదాపు ఆ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచే పూర్తి చేశారు. కానీ ’దేవుడు వరమిచ్చినా..పూజారి కరుణించని’ చందాన దేవాదాయశాఖ కమిషనరే స్వయంగా పోస్టింగ్‌ ఇచ్చినా జిల్లాకు వచ్చేసరికి సొమ్ములు ఇచ్చుకోక తప్పింది కాదని కొందరు ఉద్యోగులు గొల్లుమంటున్నారు. అప్పుడేదో అడిగారంటే అర్థం ఉంది,  తమకు కూడా  మంచి జరిగిందని ఇచ్చుకున్నాం, కానీ ఇప్పుడు రిటైర్‌మెంటప్పుడు కూడా బహుమతిలంటూ విడిచిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రపురంలో ఇదే అధికారి లక్షలు మెక్కేసి పలు దేవాలయాల్లో పనిచేస్తున్న సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్లకు చెందిన పది మందికి అడ్డగోలుగా పే స్కేల్‌ కూడా పెంచారని దేవాదాయశాఖ కోడైకూస్తోంది. 

    అడిగినంత ఇవ్వాల్సిందే...

    ఈ క్రమంలోనే పలు దేవాలయాలు, సత్రాలకు సంబంధించిన ఈవోలు దగ్గర అయినకాడికి దోచుకుంటున్నారు. తన పరిధిలో లేని దేవాలయాలకు చెందిన ఈవోలను కూడా ఆయన వదలడం లేదు. ఆలయాల ఫైల్‌పై సంతకం పెట్టాలన్న అధికారి రూ.20 నుంచి రూ.30 వేలుకు తక్కువ కాకుండా ఇండెంట్‌ పెడుతున్నారు. ఇందుకు పలువురు సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్లతోపాటు, సూపరిటండెంట్లను దళారులుగా మార్చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోను ఆ అధికారి అజమాయిషీలో సుమారు రెండు వేలకు పైగా దేవాలయాలు, సత్రాలున్నాయి. తాను ఎలాగో రిటైరవుతున్నానని మళ్లీ తనకు ఇచ్చేది ఏమీ లేదంటూ ఈవోలతో ఆయనే స్వయంగా బేరసారాలు సాగిస్తూ లక్షలు నొక్కేస్తున్నారు. నగదు రూపంలో కాకుంటే బహమతులుగానైనా ఇవ్వండని సొంత హుండీ కూడా తెరిచాడు. ఇటీవల కాకినాడలో ప్రముఖ దేవస్థానం ఈవోకు ఫో¯ŒS చేసిన తనకు బహుమతి ఇవ్వాలన్నారు. చిన్నా,చితకా బహుమతి అనుకుని అడగగానే  ఆ ఈవో అంగీకరించారు. ఆయన కోరిన బహుమతి, దాని ఖరీదు చూసి ఆ ఈబోకు దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. ఇంతకీ ఆ బహుమతి ఏమటనుకుంటున్నారు.  శామ్‌సంగ్‌ లేటెస్ట్‌ వెర్ష¯ŒS గెలాక్సీ ఎడ్‌్జ–7పై ఆశపడ్డాడు ఆ అవినీతి తిమింగలం. అంత బరువు తాను మోయలేనని చెప్పడంతో మరో ఈఓతో జతకలిసి ఇవ్వక తప్పింది కాదు.

     

    బడ్జెట్‌ ఫైల్‌ వస్తే పండగే...

    ఇటీవల అదనపు బడ్జెట్‌ కోసం వచ్చిన ఈవోల నుంచి భారీగా డబ్బులు దండుకున్నారు. కావాలంటే బడ్జెట్‌ పెంచుకోవాలని ఆ అధికారి ఉచిత సలహా కూడా ఇస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక ఆలయ కార్యనిర్వాహణాధికారి అదనపు బడ్జెట్‌ కోసం ఇటీవల సంబంధితాధికారి వద్దకు వచ్చాడు. రూ.రెండు లక్షలు బడ్జెట్‌ అనుమతికి రూ.20 వేలు డిమాండ్‌ చేయడంతో కంగుతినడం ఆ ఈఓ వంతైంది. అంత ఇచ్చుకోలేమని బేరసారాలు అడి చివరకు రూ.15 వేలకు ఖాయం చేసుకున్నాకే రూ.2 లక్షల బడ్జెట్‌కు గ్రీ¯ŒS సిగ్నల్‌ ఇచ్చారని దేవాదాయశాఖ వర్గాల ద్వారా తెలిసింది.అందినంతా దండేసుకుని మళ్లీ రిటైర్‌మెంట్‌ ఫంక్ష¯ŒSకు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తామని అధికారులు, ఉద్యోగులు ముఖం చాటేస్తున్నారు.ఆ అధికారి నిర్వాకం దేవాదయశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.  

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top