కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదనే విమర్శలు

కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదనే విమర్శలు - Sakshi


► అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్‌ నేతలు

► ఎంపీలు ప్రొఫెసర్‌ సీతారాంనాయక్, పసునూరి దయాకర్‌

► పాచికగా కోదండరాంను  వాడుకుంటున్న కాంగ్రెస్‌

► టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు




హన్మకొండ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎక్కడ తమకు భవిష్యత్‌ ఉండదేమోననే భయంతో కాంగ్రెస్‌ నాయకులు ఆయనపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఎంపీలు ప్రొఫెసర్‌ అజ్మీరా సీతారాంనాయక్, పసునూరి దయాకర్‌ విరుచుకుపడ్డారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేం దుకు కృషి చేస్తున్నారన్నారు.


ఈ క్రమంలో తెలంగాణకు రావాల్సిన వాటా నీరు రాకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోర్టుకు వెళితే, ప్రాజెక్టులు నిర్మించకుండా అడ్డుపడుతూ కాంగ్రెస్‌ నాయకులు గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో వారిలో వారికే సఖ్యత లేదని, ఆ పార్టీలోని నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. గిరిజన నియోజకవర్గానికి ఏనాడైనా వెళ్లారా, ప్రత్యేక నిధులేమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించడంలో అర్థం లేదన్నారు.



రాజకీయ బలం లేని కాంగ్రెస్‌

రాజకీయంగా బలం లేని కాంగ్రెస్‌ తెలంగాణ జేఏసీ చైర్మన్  కోదండరాంను పాచికగా వాడుకుంటుందని టీఆర్‌ఎస్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమ నేతగా కేసీఆర్‌ ఎక్కని మెట్టు లేదని, కలువని పార్టీ, నాయకుడు లేడన్నారు.


తెలంగాణలో దేశంలోనే అభివృద్ధిలో ముందు నిలి పేందుకు సీఎం కేసీఆర్‌ శ్రమిస్తున్నారన్నారు. మూడేళ్ళ పాలన చూసి జాతి గర్విస్తుందన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జన్ను జకార్య, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, నయిముద్దీన్, జోరిక రమేశ్, కమరున్నీసాబేగం, కోల జనార్ధన్, పులి సారంగపాణి, కత్తరపల్లి దామోదర్, పద్మ, శ్రీజా నాయక్, పోగు ల రమేశ్, నాగపురి రాజేష్‌ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top