ఆద్యంతం నాటకీయం..

ఆద్యంతం నాటకీయం.. - Sakshi


► సీపీఎంలో ఆరని చిచ్చు

► బహిష్కృత, పార్టీ నేతల మధ్య వాగ్వాదం

► రంగంలోకి రాష్ట్ర కమిటీ సభ్యులు


హన్మకొండ చౌరస్తా : నిత్యం పేదల జపం చేసే ఎర్రచొక్కాల కుమ్మలాటలు ఆద్యంతం నాటకీయతను తలపిస్తున్నాయి. బహిష్కృత, పార్టీ నేతల మధ్య ఘర్షణ ఆఫీసులో కుర్చీలను పగలగొట్టడం వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆది వారం ఇరువర్గాలు నిరసనలనుకాస్త డోస్‌ పెం చాయి. బహిషృత నేతలు పార్టీ ఆఫీసు ప్రధాన గేటుకు తాళం వేసి అక్కడే గేటు ఎదుట బైఠాయించగా, మిగిలిన నేతలు పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.



రంగంలోకి రాష్ట్ర కమిటీ

మూడు రోజులుగా వరంగల్‌ అర్బన్ జిల్లా సీపీఎం కమిటీలో జరుగుతున్న కుమ్ములాటలను చ ల్లార్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నేతలు రంగంలోకి దిగారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి కార్యదర్శి జి.నాగయ్య, జి.రాములు, వెంకట్‌ రాంనగర్‌లోని పార్టీ కార్యాలయానికి సాయంత్రం చేరుకున్నారు.


ఆఫీసులోకి నేతలు వెళ్తుండగా అప్పటికే గేటుకు తాళం వేసి, కార్యకర్తలు బహిష్కరణలను ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆఫీసుకు కొద్ది దూరంలో బహిష్కృత నేతలు దుబ్బ శ్రీని వాస్, కారు ఉపేందర్, పల్లం రవి, కొప్పుల శ్రీని వాస్‌తో నాగయ్య బృందం మాట్లాడే ప్రయత్నం చేశారు. ముందుగా గేటుకు తాళం తీసి కార్యకర్తలను పంపించాలని సూచిం చారు. అందుకు  శ్రీనివాస్‌ తమ కార్యకర్తలనే కాదు అందరినీ పం పించాలని చెప్పడంతో వారు ఒప్పుకోలేదు.ఈ సమస్యను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తామని గేటుకు తాళం తీసి కార్యకర్తలను పంపించాలని మరోసారి చెప్పడంతో వారు ససేమిరా అన్నారు.  



ఘటన దురదృష్టకరం

పార్టీ కార్యాలయం ఎదుట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి. నాగయ్య మీడియాతో మా ట్లాడారు. సీపీఎం వరంగల్‌ చరిత్రలో ఎన్నడూ లేని సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టక రం, సమస్య త్వరలోనే పరిష్కారం అయ్యేలా రాష్ట్ర కమిటీ, అవసరమైతే కేంద్ర కమిటీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్నారు. పార్టీ ఆఫీసులోకి కొన్ని అరాచకశక్తులు చేరి ద్వంసం చేయడం భాదాకరమన్నారు. ఇప్పటిౖMðనా పలువురు పద్దతులను మా ర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top