బంగారు బతుకమ్మతో ప్రజాక్షేమం

బంగారు బతుకమ్మతో ప్రజాక్షేమం - Sakshi


నిజామాబాద్ ఎంపీ కవిత

 

 నర్సంపేట: తెలంగాణ మహిళలతో.. ఇష్టమైన బంగారు బతుకమ్మతో రాష్ట్రంలో ప్రజాక్షేవుం సాధ్యమవుతుందని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బంగారు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. బంగారు తెలంగాణ కోసం బతుకమ్మ తల్లి దేవత దీవెనలు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కష్టాలు ఉన్నాయుని, అవన్ని తీర్చడం కోసం సీఎం కేసీఆర్ ప్రయుత్నం చేస్తున్నాడన్నారు.



తెలంగాణ ప్రభుత్వం కేవలం 15 నెలల పాప మాత్రమేనని, అలాంటి పాప అన్నింటినీ వెంటనే చేయుడం సాధ్యం కాదని, కొంత సమయుం పడుతుందన్నారు. బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి సహకరిం చాలన్నారు. బతుకవ్ము విశిష్టతను తెలుసుకున్న విదేశాలు తెలంగాణ  సంస్కృతి, సంప్రదాయూల పట్ల వుక్కువ చూపిస్తూ ఇక్కడి ప్రత్యేకతను తెలుసుకుంటున్నాయుని తెలిపారు.



కవిత గో బ్యాక్: గఢీల బతుకమ్మ కాదు.. బడుగుల బతుకమ్మ ఆడాలంటూ ఐద్వా, ప్రజా సంఘాలు, ఆశల కార్యకర్తల ఆధ్వర్యంలో పలువురు నిరసన ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మలతో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కవిత గో బ్యాక్ అంటూ ఈ ర్యాలీ సాగింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top