హరితహారానికి భూములను గుర్తించండి


► అధికారులతో కలెక్టర్‌ సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్సు



సాక్షి, కామారెడ్డి : హరితహారంలో భాగంగా ప్రతీ మండలంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్రణాళిక సిద్దంగా ఉంచుకోవాలన్నారు. రెండు లక్షల యూకలిప్టస్‌ మొక్కలను నాటాలని ఆదేశించారు.



జిల్లాలో కోటి 30 లక్షల మొక్కలు నాటడానికి లక్ష్యం నిర్ణయించినందున అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ నెల నాలుగో వారం లేదా జూలై మొదటి వారంలో హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారని, అప్పటిలోగా సంసిద్దులై ఉండాలన్నారు. ప్రతీ మండలంలో 50 వేల సీడ్‌ బాల్స్‌ను తయారు చేయించి నిల్వ ఉంచుకోవాలన్నారు.  ఉపాధి హామీ పథకంలో 45 లక్షల పనిదినాలను కల్పించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపినందుకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి అభినందించిన విషయాన్ని మండల అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మనిమాల, డీఈవో మదన్‌మోహన్, డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఎఫ్‌డీవో రేఖాభాను, జిల్లా అధికారులు గజ్జారాం, శ్రీనివాస్, చంద్రశేఖర్, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top