'కథలు కాదు.. మీకు బుల్లెట్లాంటి మంత్రి ఉండు'

'కథలు కాదు.. మీకు బుల్లెట్లాంటి మంత్రి ఉండు' - Sakshi


నారాయణ ఖేడ్: దేశంలో ఎక్కడా లేని వృద్ధులకు వెయ్యి రూపాయల ఫించన్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వికలాంగులకు రూ.1500 ఇస్తున్నామని గుర్తు చేశారు. నెలకు ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని, ఆటోవాలాలకు ట్యాక్స్లు లేకుండా చేశామని గుర్తు చేశారు. నారాయణ ఖేడ్ లో ఉప ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఇక్కడికి వచ్చిన కేసీఆర్ మాట్లాడారు. డ్రైవర్లకు బీమా ఇస్తున్నామని, నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్లులు తగ్గిస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడా లేని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు.



'హాస్టల్ లో చదువుకునే పిల్లలకు సన్న బియం పెడుతున్నారు. కథలు చెప్పడానికి ఇక్కడకు రాలేదు. విద్యాధికులు, ఉద్యోగులు, మేధావులు ఆలోచించాలి. నారాయణ ఖేడ్ లో స్వాతంత్ర్యంలేదు. గుండాగిరి దాదాగిరి, డబ్బులివ్వడం, తాగుడు పోయడం, ఒట్లు వేయించడం అంతా పాత చింతకాయ పచ్చడే. బుల్లెట్ లాగా దూసుకెళ్లే మంత్రి (హరీష్ రావు) మీ మధ్య ఉన్నారు. హరీష్ రావు మిమ్మల్ని భూపాల్ రెడ్డిని గెలిపించాలని అడుగుతున్నాడు. నారాయణ్ ఖేడ్ ను సిద్ధిపేటలాగా మారుస్తా అంటున్నాడు. మీరు అలాగే చేసి భూపాల్ రెడ్డికి ఓటేస్తే గోదావరి నీళ్లు తీసుకొచ్చి మీ కాళ్లు కడుగుత' అని కేసీఆర్ ఆన్నారు. నారాయణ ఖేడ్ చరిత్రలో ఇంత పెద్ద సభ జరగలేదని, గతంలో రెండు సార్లు ఇక్కడి వచ్చానని కేసీఆర్ అన్నారు.



'నారాయణ ఖేడ్ లో ఇన్ని రోజులు మార్కెట్ కమిటీ ఉండదా, మార్కెట్ యార్డ్ ఉండదా, హాస్పత్రులు ఉండవా, ఇంత దారుణంగా ఉంటుందా, ఇంకా దారిద్ర్యం కావాల్నా.. కాంగ్రెస్, టీడీపీ పాలన పాత చింతకాయ పచ్చడేగా. కాంగ్రెస్, టీడీపీ ఏం చేసిర్రో మీకు తెలియనిది కాదు. తెలివిగా ఓటెయ్యాలంటే భూపాల్ రెడ్డిని గెలిపించాలి. నారాయణ ఖేడ్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను. రెండు రోజులపాటు నేనే స్వయంగా తిరిగి అన్ని అభివృద్ధి పనులు చేస్తా' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top