తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలి

తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలి


సీఎల్పీ డిమాండ్

బడ్జెట్ కేటారుుంపులకు ‘కోత’ ప్రకటనలపై ఆగ్రహం

నయీమ్ కేసును సీబీఐకి ఇవ్వాలి..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో షాడో కేబినెట్ ఏర్పాటుకు నిర్ణయం


 సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దును సాకుగా చూపి రాష్ట్ర బడ్జెట్ కేటారుుంపుల్లో కోతపెడతామంటూ అప్రజాస్వామికంగా ఎలా నిర్ణరుుంచుకుంటారని ప్రభుత్వంపై కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన పార్టీ శాసనభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీలోని కమిటీహాలులో గురువారం సమావేశమయ్యారు. మండలిలో కాంగ్రెస్‌నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశం వివరాలను సీఎల్పీ కార్యదర్శి పి.రామ్మోహన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.


పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటారుుంపుల్లో శాఖలవారీగా కోత పెడతామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రకటనపై సీఎల్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై శాసనసభలో చర్చ జరిగి.. ఆమోదం పొందిందని గుర్తుచేశారు. ఆదాయం తగ్గిందనే సాకుతో బడ్జెట్ కేటారుుంపుల్లో కోతపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. శాసనసభ ఆమోదించిన బడ్జెట్‌ను, అదే సభలో చర్చించకుండా, ఆమోదం తీసుకోకుండా కోతపెడ్తామని ఆర్థిక మంత్రి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని సీఎల్పీ ప్రశ్నించింది.


రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం ఎంత, పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు ఏమిటి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలసిన సందర్భంలో చర్చలు ఏమిటి, సీఎం కేసీఆర్ ఇచ్చిన లేఖలో ఏముందనేది అసెంబ్లీలో చర్చించాలని సీఎల్పీ డిమాండ్ చేసింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం, ఆదాయం తగ్గడంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరింది. వీటిపై చర్చించడానికి వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేసింది. ఈ నెల 5లోగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించాలని కోరింది. లేకుంటే అసెంబ్లీలోని గాంధీవిగ్రహం దగ్గర ఈ నెల 5న నిరసన వ్యక్తం చేయాలని నిర్ణరుుంచింది.


ఓటుకు కోట్లు కేసుపై సీబీఐ విచారణ జరిపించాలి...

గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్, ఓటుకు కోట్లు కేసులను సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ డిమాండ్ చేసింది. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత వేలకోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం ఉందని, ఆ డబ్బంతా ఏమైందని ప్రశ్నించింది. నయీమ్ దాచిపెట్టుకున్న వేలకోట్ల రూపాయలను ప్రభుత్వంలోని ముఖ్యులు తీసుకున్నారా, ప్రభుత్వమే స్వాధీనం చేసుకుందా, పోలీసులు పంచుకున్నారా అనేది తేల్చాలని డిమాండ్ చేసింది. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించింది. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగినందుకే ఈ కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మధ్యవర్తిగా చంద్రబాబు, కేసీఆర్‌ను కలిపారని ఆరోపించింది.


శాఖలవారీగా షాడో కేబినెట్

రాష్ట్రంలో శాఖల వారీగా జరుగుతున్న పనులపై షాడో కేబినెట్‌గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించాలని సీఎల్పీ నిర్ణరుుంచినట్టు తెలుస్తోంది. ఏ శాఖపై ఎవరు అధ్యయనం చేయాలన్న అంశంపై నిపుణులతో చర్చించే బాధ్యతలను పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డికి అప్పగించారు.

పీసీసీ, సీఎల్పీ మధ్య ఉన్న సమన్వయలోపంపైనా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీరుుంబర్సుమెంట్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో చేసిన హామీని అమలుచేయకపోవడంపై సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇవ్వాలని నిర్ణరుుంచినట్టు తెలిసింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top