సిటీ స్కాన్ కు సుస్తీ చేసింది


  • నాలుగు నెలలుగా మరమ్మతులకు గురైనా నిర్లక్ష్యమే

  • ప్రైవేటుతో ఒప్పందాలేనని అనుమానాలు

  • ప్రతిపాదనలు పంపించామంటూ సన్నాయినొక్కులు

  • ఎక్స్‌రేదీ అదే పరిస్థితి  ∙ఇబ్బందులు పడుతున్న రోగులు

  •  

    కాకినాడ వైద్యం :

    రోగులూ ఇటు రాకండి ... ఎందుంటే గత నాలుగు నెలలుగా సీటీ స్కాన్ పాడైపోయింది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సాంకేతికత తికమకగా తయారై రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులకు గంట వ్యవధిలో అందించాల్సిన సాం కేతిక వైద్య సేవలు ఒక్కొక్కటి గా తెరమరుగవుతున్నాయి. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలైన క్షతగాత్రులకు ఆ గాయాల తీవ్రతను వైద్యులు పరిశీలించేందుకు తీయాల్సిన సిటీ స్కాన్ కాకినాడ జీజీహెచ్‌లో మూలనపడింది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా  వైద్య సేవలు నిలిచిపోడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

     

    2002లో ఏర్పాటు...

    కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 2000 సంవత్సరం నుంచి పెరుగుతున్న రోగుల తాకిడికి తగ్గట్టుగా సిటీస్కాన్పరికర అవసరాన్ని అప్పటి అధికార్లు గుర్తించారు. 2002లో అప్పటి కలెక్టర్‌ సతీష్‌చంద్ర జోక్యంతో ఏఎంజీ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రతినిధి, సామాజికవేత్త డాక్టర్‌ మెర్ల బాబ్జి అభ్యర్థన మేరకు జర్మనీ దేశస్థుడు, ఉదారవేత్త డాక్టర్‌ హెచ్‌హెచ్‌ డైక్‌మ¯ŒS రూ.50లక్షల వ్యయంతో సిటీ స్కా¯ŒS పరికరాన్ని జీజీహెచ్‌కు సమకూర్చారు. ఈ పరికరం మూడేళ్లపాటు నిర్విరామంగా సేవలందించింది. అనంతరం మరమ్మతులకు గురైనప్పుడల్లా డాక్టర్‌ డైక్‌మ¯ŒS సమకూర్చిన నిధులతోనే సంబంధిత కంపెనీ మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలో పెట్టేది. కాలక్రమంలో ఆసుపత్రి పరిపాలనాధికారులు పర్యవేక్షణాలోపంతో సేవలు స్తంభించాయి. మొరాయించిన సిటీ స్కాన్ పరికరాన్ని పూర్తిగా తొలగించాలని, తిరిగి కొత్త పరికరాన్ని సమకూర్చాల్సిందిగా గత కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి డాక్టర్‌ డైక్‌మ¯ŒSకే వినతి చేరడంతో రెండోసారి కూడా రూ.80 లక్షల వ్యయంతో సీమె¯Œ్స కంపెనీకి చెందిన ఆధునాతన సిటీ స్కాన్ పరికరాన్ని జీజీహెచ్‌కు అందజేశారు. అంతేకాకుండా మూడేళ్లపాటు దాని మరమ్మతులు ఆ కంపెనీయే భరించేలా ఒప్పందం కుదిర్చారు. అయితే ఈ పరికరం పనిచేసేందుకు ఖచ్చితంగా మూడు ఏసీ పరికరాలుండాలి. ఆస్పత్రి  అధికారుల ఉదాసీనత ఫలితంగా ïసిటీ స్కాన్ గదిలో ఏసీలు çసక్రమంగా పనిచేసిన దాఖలాల్లేవు.  

     

    రెండు సిటీ స్కాన్లు అవసరం...

    నిత్యం సుమారు 2,500 నుంచి 3,000 రోగులు జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి వైద్య  సేవలకు  కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారు. అందులో సుమారు రోజుకి 40 మందికి సిటీ స్కానింగ్‌ చేయించాల్సిందిగా వైద్యులు సూచిస్తుంటారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 1500–1700 మందిలో రోజుకి సుమారు 60 కేసులకు సిటీ స్కాన్ చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. వాస్తవానికి ఈ పరికరంపై రోజుకి 30కి మించి చేసినటైతే తొందరగా మిష¯ŒS మరమ్మతులకు గురయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. పరికర సామరŠాధ్యనికి మించి కేసులు నమోదవుతున్నా అదనంగా మరో పరికరాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆసుపత్రి అధికారులు ప్రస్తుతం ఉన్న పరికరాన్ని కూడా వినియోగంలో పెట్టలేకపోవటం పర్యవేక్షణా లోపాన్ని తేటతెల్లం చేస్తోంది. 

     

    ప్రైవేటుకు తరలింపులు...

    సిటీ స్కాన్ మొరాయింపుతో కేసులన్నీ ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ వర్తించేవారికి కాకినాడలోని ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లకు తరలిస్తుండగా, ఈ పథకం వర్తించని వారి పరిస్థితి అయోమయంగా తయారైంది. ప్రాణాపాయమైనా ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాల్లేవని రోగులు వాపోతున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌‡ వైద్య సేవకు సంబంధించిన పత్రాలు, సంతకాలు చేయించేందుకే పుణ్యకాలం గడిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి పరిపాలనాధికార్లకు సిటీ స్కా¯ŒS మొరాయింపు కాసుల పంటగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెరవెనుక మధ్యవర్తిత్వం పోషిస్తున్న దళారీలకు నిత్య పంటగా తయారైందంటున్నారు. ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్ల నుంచి దళారీల ద్వారా ఆసుపత్రి ఉన్నతాధికారులకు  కేసుకు కొంత మొత్తం వంతున రోజుకి ఇంత చొప్పున  ముడుపులు అందుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలలుగా మరమ్మతులకు గురైనా పట్టించుకోకపోవటం ఈ ఆరోపణలకు బలంచేకూర్చుతోంది. ఈ పరికరం మరమ్మతులకు సుమారు రూ.10 లక్షల వ్యయం అవుతుందని, కలెక్టర్‌ అనుమతితో మరమ్మతులు చేయించవచ్చంటున్నారు. 

     

    సూపరింటెండెంట్‌నే అడగండి

    సిటీ స్కాన్ పరికరం ఈ ఏడాది జులై నుంచి పనిచేయటం లేదని సూపరింటెండెంట్‌కు తెలియజేశాం. ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో సూపరింటెండెంట్‌నే అడిగి తెలుసుకోవాలి.

    – డాక్టర్‌ రాధారాణి , రేడియాలజీ విభాగాతిపతి

     

    ప్రభుత్వానికి తెలియజేశాం

    కాకినాడ జీజీహెచ్‌లోని సిటీ స్కాన్ పనిచేయటం లేదని ప్రభుత్వానికి తెలియజేశాం. పరికరం పాతదైపోయినందున పలుమార్లు లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించాం. మరొక కొత్త పరికరాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ విషయమై ౖ వైద్య,ఆరోగ్య శాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లాం. అవసరాన్ని బట్టి అత్యవసరమైన కేసులకు ఆరోగ్య సేవలో ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లకు పంపుతున్నాం.

    – డా.వై.నాగేశ్వరరావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్, కాకినాడ

     

    వేలకు వేలిచ్చి బయట చేయించుకుంటున్నాం

    ఆస్పత్రిలోని సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో  వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్‌ ఆస్పత్రి పరీక్షలు చేయించుకుంటున్నాం. సిటీ స్కాన్ చెడిపోయి నాలుగు నెలలైనా మరమ్మతులు చేయకపోవడం దారుణం. ఈ విషయమై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి.

    – పలివెల వీరబాబు, ఇంద్రపాలెం 

     

    ఎక్స్‌రే కోసం గంటల కొద్దీ నిరీక్షణ...

    అక్కడ ఏ రోజు చూసినా  జనం బారులు తీరి ఉంటారు మహిళలు, చిన్నారుల పరిస్థితి అయితే మరీ ఘోరం. గంటల కొద్దీ వేచి ఉన్నా  పని జరగకపోవడంతో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌రే కేంద్రాల వద్ద అధికారుల పర్యవేక్షణ లోపించడం, మిషన్లు తరచూ మరమ్మతులకు గురవ్డంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఆస్పత్రిలో సుమారు ఎనిమిది ఎక్సరే కేంద్రాలున్నా, అయిదు కేంద్రాలే పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని రోగులు తెలిపారు. ఎక్సరే కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, సిబ్బందిపై  ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top