లడఖ్‌కు పర్వతారోహక బృందం

లడఖ్‌కు పర్వతారోహక బృందం

 

చింతూరు:

ఇరవై రోజులపాటు చింతూరులో శిక్షణ పొందిన రాష్ట్రానికి చెందిన పర్వతారోహక బృందం శుక్రవారం శిక్షణ ముగించుకుని జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌కు బయలుదేరి వెళ్లింది. ఎవరెస్టు అధిరోహణలో భాగంగా రాష్ట్రానికి చెందిన 16 మంది పర్వతారోహక శిక్షకుడు దూబి భద్రయ్య ఆధ్వర్యంలో ఇరవై రోజులపాటు చింతూరు గురుకుల పాఠశాల ఆవరణలో శిక్షణ పొందారు. శిక్షణ పూర్తికావడంతో జమ్మూకాశ్మీర్‌కు వెళుతున్నామని అక్కడ వాతావరణ అనుకూలతను బట్టి ఫిబ్రవరిలో లడఖ్‌ పర్వతారోహణ ఉంటుందని భద్రయ్య తెలిపారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో ఎవరెస్టును అధిరోహించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఈ బృందానికి తహశీల్దార్‌ జగన్మోçßæనరావు, గురుకుల పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, ఆర్‌ఐ, విద్యార్థులు జాతీయ జెండాను అదించి వీడ్కోలు పలికారు. అన్ని అవరోధాలు అధిగమించి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top