చిన్నారిని మింగిన చెరువు

చిన్నారిని మింగిన చెరువు - Sakshi


కొత్తూరు: ఉదయం వరకు ముద్దు ముద్దు మాటలతో పలకరించిన చిన్నారి సాయంత్రానికి శాశ్వతంగా వదిలి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కంటికీ మిం టికీ ఏకధారగా ఏడుస్తున్నారు. అంతకుముందు రోజు వరకు తమ కంటి ముందరే ఆడుకున్న చిన్నారి కదలకుండా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. చిన్న దెబ్బకే తట్టుకోలేని ఆ శరీరం చెరువులో ఊపిరాడక ఎంత అవస్థ పడిందోనని అ మ్మానాన్నలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చిన్నారులను సంరక్షించాల్సిన అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ ఆశల దీపం ఆరిపోయిందని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..





కొత్తూరు మండలంలోని పారాపురం గ్రామంలో అంగన్‌వాడీకి వెళ్లిన చిన్నారి చెరువులో పడి చనిపోయిన ఘటన సోమవారం స్థానికంగా కలకలం రేపింది. గ్రా మంలోని కుంచాల జోగారావు, అ నసూయ దంపతుల చిన్న కు మార్తె భార్గవిని నానమ్మ అప్పల మ్మ ఎప్పటిలాగానే సోమవారం అంగన్‌వాడీకి తీసుకొచ్చారు. మ ధ్యాహ్నం 12.30 గంటలకు కేం ద్రంలో భోజనాలు పెట్టారు. త ర్వాత కార్యకర్త జలజాక్షి, హెల్ప ర్లు భోజనం చేస్తుండగా భార్గవి పాస్‌కు వెళ్తానని చెప్పి బయటకు వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. చా లా సేపైనా భార్గవి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి కంకర చెరువు వద్ద అక్కడ ఉన్న వారితో వెతికించారు. కానీ చిన్నారి ఆ చూ కీ దొరక్కపోవడంతో ఇంటికి వెళ్లిపోయిందేమోనని అనుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.



 అయితే చిన్నారి ఇంకా ఇం టికి రాకపోవడంతో వెంటనే తల్లిదండ్రులు అంగన్‌వాడీ వద్దకు వ చ్చి చెరువులో దిగి వెతికారు.

కాసేపటి తర్వాత చెరువు అ డుగు భాగంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. ఈ దృశ్యాన్ని చూసిన తల్లి అనసూయతో పాటు బంధువులు భోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చెరువులో పడి చనిపోయిందని వారు ఆరోపించా రు. ఈ మేరకు చిన్నారి తండ్రి జో గారావు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బంది మాత్రం తాము భోజనం చేస్తుండగా భార్గవి బయటకు వె ళ్లిందని, తాము కూడా వెతికామని చెబుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top