రేషన్‌ అక్రమాలకు కైజాలతో చెక్‌!

జె.శాంతి కుమారి

యాప్‌ ద్వారా పౌరసరఫరాల విభాగాల అనుసంధానం

కైజాల పేరుతో యాప్‌ ఏర్పాటు చేసిన కమిషనర్‌ 

రేషన్‌ సరఫరాలో అక్రమాల నిరోధానికి అవకాశం

 

 

విజయనగరం కంటోన్మెంట్‌: రేషన్‌ సరకు అలాట్‌మెంట్‌... ఎంఎల్‌ఎస్‌పాయింట్‌నుంచి విడుదల... డిపోలకు సరఫరా... పంపిణీ అన్నీ... ఇక ఆన్‌లైన్‌ద్వారానే. ఇందుకోసం కైజాల పేరుతో యాప్‌ రూపొందించారు. పౌరసరఫరాల విభాగానికి సంబంధించిన విభాగాలన్నింటినీ దానితో అనుసంధానం చేశారు. రేషన్‌ పంపిణీలో అవకతవకలకు చెక్‌ చెప్పనున్నారు. జిల్లాలోని ప్రజా పంపిణీ సేవలను అందిస్తున్న పౌరసరఫరాల శాఖ దశలన్నీ ఒకే యాప్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. కైజాల పేరుతో ఏర్పాటు చేసిన ఈ యాప్‌ ద్వారా కమిషనర్‌ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ అందరికీ సూచనలు, ఉత్తర్వులు పంపిస్తారు. ప్రతీ నెలా బియ్యం కేటాయింపులు, రేషన్‌ కార్డు దారులకు సరుకులు వెళ్లే వరకూ ఈ యాప్‌ ద్వారానే పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ఈ యాప్‌ను డీఎస్‌ఓలకు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశాలొచ్చాయి. కైజాల యాప్‌లో డీఎస్‌ఓలు, ఏఎస్‌ఓలు, సీఎస్‌డీటీలు, మండల లెవల్‌ స్టాక్‌ పాయింట్‌ ఇన్‌చార్జిలను పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం శాఖా పరంగా ఇచ్చే ఆదేశాలు, పర్యవేక్షణ కమిషనర్‌ కార్యాలయం నుంచి మెయిల్‌ చేస్తున్నారు. ఆ మెయిల్స్‌ను అనుసరించి డీఎస్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడమో లేక టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించడమో చేసి ప్రతీ నెలా స్టాక్‌ పొజిషన్‌ వంటివి చూస్తున్నారు. ఇప్పుడీ యాప్‌ ద్వారా ఎక్కడివారక్కడే ఉన్నప్పటికీ ఆదేశాలు, సూచనలు, పర్యవేక్షణలను యాప్‌ ద్వారా చేపడతారు. ఇటీవల కష్ణా పుష్కరాల్లో కూడా ఈ యాప్‌ ద్వారానే పలు సేవలందించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు, సిబ్బందికి ఏర్పాటుచేసిన ఈ యాప్‌ మరికొంత అభివద్ధి చేసి డీలర్లకూ ఇందులో ప్రమేయం ఉండేలా చర్యలు తీసుకుంటారు. దీంతో పౌరసరఫరాల శాఖ మొత్తం ఈ కైజాల యాప్‌తోనే పర్యవేక్షిస్తారు. 

 

 

ఇక నుంచి కైజాల యాప్‌లోనే పర్యవేక్షణ: జె.శాంతికుమారి, డీఎస్‌ఓ, విజయనగరం

పౌరసరఫరాల శాఖ ద్వారా జరిగే అన్ని కార్యక్రమాలు కైజాల యాప్‌ సహకారంతో చేపడతాం. అన్ని స్థాయిల్లోనూ ఆదేశాలు, ఉత్తర్వులు, పర్యవేక్షణ చేపడతాం. ఇది మంచి ఫలితాలనిస్తుందని భావిస్తున్నాం. మరింత అభివద్ధి చేసి రేషన్‌ డీలర్లతో సహా అందరూ ఈ యాప్‌ ద్వారానే పనులు చేసేలా కమిషనర్‌ చర్యలు తీసుకుంటున్నారు. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top