కామకేళి..!

కామకేళి..!


బస్సుల్లో బూతు పనులు

పద్మాక్షికాలనీలో గలీజ్‌ యవ్వారం

వ్యభిచార కూపంగా బస్సుల అడ్డా

లాడ్జీలుగా మారిన టూరిస్టు వాహనాలు

వీధి దీపాలు కరువు

∙  జాడ లేని పోలీసుల పెట్రోలింగ్‌




జిల్లా కేంద్రం.. హన్మకొండ బస్టాండ్‌కు కూత వేటు దూరం.. వీధి దీపాలు లేవు.. పోలీసుల పెట్రోలింగ్‌ లేదు. అంతేకాదు.. ఏ ఒక్క అధికారి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇంకేముంది.. వారు ఆడిందే ఆట.. పాడిందే పాట. పగలు, చీకటి అనే తేడా లేదు.. అక్కడ నిలిపి ఉన్న టూరిస్టు వాహనాలను లాడ్జీలుగా మార్చుకుంటున్నారు. బస్సుల్లోనే కాదు.. వాటి పరిసరాలను సైతం అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్‌గా మలుచుకున్నారు. ఇక్కడ కొంత కాలంగా న్యూసెన్స్‌ పరాకాష్టకు చేరుకోగా.. స్థానికులు బెంబేలెత్తుతున్నారు. వ్యభిచార కూపంగా మారిన పద్మాక్షికాలనీలోని బస్సుల అడ్డాపై ‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌..



వరంగల్‌: నగరంలోని పద్మాక్షి కాలనీలో అసాంఘీక కార్యకలాపాలు పరాకాష్టకు చేరుకున్నాయి. టూరిస్టు బస్సులకు పార్కింగ్‌ కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు వ్యభిచార కూపాలుగా మారుస్తున్నారు. నిత్యం ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యాకలాపాల కారణంగా స్థానికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పగటి వేళల్లోనూ ఈ రోడ్డులో నడిచేందుకు మహిళలు అవస్థలు పడుతున్నారు. పోలీసుల గస్తీ కరువైపోవడంతో స్థానికులను కలవరపాటుకు గురిచేస్తోంది.



రాత్రి పది దాటితే..

ఐదారేళ్లుగా ప్రైవేట్‌ టూరిస్టు బస్సులను పద్మా క్షి గుట్ట దగ్గరున్న వాటర్‌ట్యాంకు సమీపంలో ని లుపుతున్నారు. ప్రతీరోజు ఇక్కడ ఇరవైకి పైగా ప్రైవేట్‌ బస్సులు రాత్రి, పగలు నిలిపి ఉంచుతున్నారు. ఆఫ్‌ సీజన్‌ అయితే ఒక్కోసారి 50కి పై గా బస్సులు ఆగి ఉంటాయి. బస్సు వెంట బ స్సు, బస్సు పక్కన బస్సులను నిలిపి ఉంచుతా రు. దీంతో రెండు బస్సుల మధ్య ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా బస్సుల మధ్య రొమాన్సులు చేస్తున్నారు. ఈ తతంగం రోజూవారీ కార్యక్రమంగా కొనసాగుతున్నా అడ్డుకునే వారే కరువయ్యారు. ఫలితంగా ఇటీవల కాలంలో పద్మాక్షిగుట్టకు వచ్చే కొందరు యువతీయువకులు ఈ అడ్డాపై ఆకర్షితులవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.



తలెత్తుకోలేక..

కొందరు వ్యభిచారులు టూరిస్టు బస్సుల అడ్డాను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హన్మకొండ బస్‌స్టేషన్, హన్మకొండ చౌరస్తా వంటి జనసంచారం కలిగిన ప్రాంతాల్లో విటులను ఆకర్షించిన తర్వాత బస్సుల అడ్డాకు చేరుకుంటున్నారు. కొందరు డ్రైవర్లు, క్లీనర్లు బస్సులను వ్యభిచార కేంద్రాలుగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. పద్మాక్షి గుట్టకు వచ్చే యువకులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు అంటున్నారు. బస్సుల్లో వ్యభిచారం చేస్తున్న అంశాన్ని బీట్‌ కానిస్టేబుళ్లకు, పెట్రోలింగ్‌ సిబ్బందికి పలుమార్లు కాలనీవాసులు పట్టించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.



బస్సులే బార్లు..

రాత్రి, పగలు తేడా లేకుండా కొంతమంది డ్రైవర్లు, క్లీనర్లు మద్యం తాగుతూ బస్సులను బార్లుగా మార్చేశారు. మద్యం మత్తులో మహిళలను వేధించడం పరిపాటిగా మారింది. తాగి మహిళలపై నోరుపారేసుకున్న వారిని పలుమార్లు స్థానికులు చితకబాదిన సంఘటనలు ఉన్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top