శ్రమయేవ జయతే..

శ్రమయేవ జయతే.. - Sakshi


► కానిస్టేబుల్‌ ఉద్యోగాలు పొందిన అన్నదమ్ములు

► తండ్రి ఆశయాన్ని సాధించిన తనయులు


మొయినాబాద్‌: కొడుకులను పోలీసులుగా చూడాలని ఆ తండ్రి కలలు కన్నాడు. వ్యవసాయంలో తాను కష్టపడుతూ వారిని చదివించాడు. కానీ,  విధి వింతనాటకం ఆడింది. కొడుకులకు కొలువు రాకముందే రోడ్డు ప్రమాదం తండ్రిని కబళించింది. ఆయన ఆశయాన్ని మాత్రం ఆ కొడుకులు నిజం చేశారు. ఆత్మవిశ్వాసంతో కష్టపడితే దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు. ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములు ఏఆర్‌ కానిస్టేబుళ్లుగా ఉద్యోగం సంపాదించారు.


వివరాలు ఇవి... మొయినాబాద్‌ మండలం కనకమామిడి గ్రామానికి చెందిన ఆలూరి సత్తయ్య సుశీల దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కొడుకు రాజు, కూతురుకు పెళ్లిళ్లయ్యాయి. ఎనిమిదెకరాల పొలం ఉంది. వ్యవసాయం చేసి కొడుకులను చదివించాడు. రెండో కొడుకు శంకర్, చిన్న కొడుకు శ్రీనివాస్‌ పోలీసు ఉద్యోగాలలో చేరాలని ఆ తండ్రి తాపత్రయపడ్డాడు. తనకు తోడుగా ఉండాలని  కొడుకులు పొలానికి వచ్చినా..వారిని వ్యవసాయ పనులు చేయనీకుండా చదువు కోవాలని చెప్పేవాడు. దురదృష్టవశాత్తూ 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తయ్య మరణించాడు.



తండ్రి కలను నెరవేర్చాలని...

తండ్రి మరణించడంతో పెద్ద కొడుకు రాజు పూర్తిగా వ్యవసాయం చూసుకునేవాడు. సమయం దొరికినపు్పడల్లా అతనికి తోడుగా ఇద్దరు తమ్ముళ్లూ వ్యవసాయ పనులకు వెళ్లేవారు. కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్  ఇవ్వడంతో కచ్చితంగా ఉద్యోగం సాధించాలని అన్నదమ్ములిద్దరు నిర్ణయించుకున్నారు. 2014లో డిగ్రీ పూర్తి చేసిన శంకర్, ప్రస్తుతం డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చేస్తున్న శ్రీనివాస్‌ ఇద్దరూ కాని స్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేశారు. నగరంలో ఓ గది అదె ్దకు తీసుకుని అక్కడే ఉండి కోచి ంగ్‌కు వెళ్లారు. ఇద్దరినీ చదివిం చేందుకు అన్న రాజు పూర్తి సహకారం అందించి ప్రోత్సహించాడు. తండ్రి బతికు న్నపు్పడు కన్న కలను కొడుకులిద్దరు ఇపు్పడు సాకారం చేశారు.



తండ్రి ఆశయం మేరకు...

మా నాన్నకు పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టముండేది. మమ్మల్ని పోలీసులు కావాలని చెప్పేవాడు. ఆయన కలను నెరవేర్చాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశాను. ఆయన ఉన్నపు్పడు ఉద్యోగం రాలేదు. 2014లో రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోయారు. ఆయన కల నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడ్డాను. అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. –ఆలూరి శంకర్‌



ఆనందంగా ఉంది..

ఓ వైపు డిగ్రీ చదువుతూనే మరో వైపు కానిస్టేబుల్‌ పరీక్షకు ప్రిపేరయ్యాను. అన్న శంకర్‌తోపాటు నగరంలో ఉంటూ కోచింగ్‌ తీసుకున్నాను. మా నాన్న చనిపోయారనే భాద ఉంది. కానీ, ఆయన మా కలలుగన్న ఉద్యోగం సంపాదించినందుకు ఆనందంగా ఉంది.   –ఆలూరి శ్రీనివాస్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top