కారు కమిటీలకు బ్రేక్‌

కారు కమిటీలకు బ్రేక్‌ - Sakshi


టీఆర్‌ఎస్‌లో కొలిక్కిరాని నియోజకవర్గ కమిటీలు

నాలుగు జిల్లాల్లోనూ అదే పరిస్థితి

ప్లీనరీ ముగిసి నెలైనా ఊసేలేదు

అయోమయంలో నాయకులు, కార్యకర్తలు


ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో సంస్థాగత పదవులకు బ్రేక్‌ పడింది. కేవలం మండల కమిటీలతోనే సరిపెట్టాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో సంస్థాగత ప్రక్రియ ముగియడం లేదు. గత ఏప్రిల్‌ 21న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ముగిసింది. టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల్లో ప్లీనరీ ముఖ్యమైంది. జిల్లా కమిటీల స్థానంలో అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ నియమావళిలో మార్పులు చేస్తూ ప్లీనరీలో నిర్ణయం తీసుకున్నారు.


సంస్థాగతంగా పార్టీని అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయికి వికేంద్రీకరించడం ద్వారా సా ్థనికంగా పూర్తిస్థాయి ఆధిపత్యం సా« దించేందుకు ప్లీనరీ తర్వాత జిల్లా కమిటీలను పూర్తిగా రద్దు చేశారు. వీరి స్థాన ంలో నియోజకవర్గ కమిటీలు వేస్తున్నట్లు ప్రకటిం చారు. ఈ నేపథ్యంలో ముందుగా మండల కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కమిటీల్లో చాలామందికి పాతవారికే అవకాశం కల్పించడం     గమనార్హం. కానీ నియోజకవర్గ కమిటీలు వేయకపోవడంతో అధికార పార్టీలో స్తబ్దత నెలకొంది. నియోజకవర్గ, మండల కమిటీల నియామకం ఎంతకీ పూర్తి కాకపోవడంతో పదవుల కోసం నేతలు పడిగాపులు కాస్తున్నారు.


నామినేటెడ్‌ పదవుల సంగతి ఏమోకానీ పార్టీ పదవులు సైతం రాకపోవడంతో టీఆర్‌ఎస్‌లోని కొంతమంది నేతలు నైరాశ్యానికి గురవుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశవాహులకు అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడం, స్థానిక ఎమ్మెల్యేలు సైతం ఈ కమిటీల ఏర్పాటుపై ఊసేత్తకపోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.



నెలైనా కమిటీల ఊసులేదు..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ముథోల్, నిర్మల్, ఆసిఫాబాద్, చెన్నూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో పది నియోజకవర్గ కమిటీలు వేస్తారని, ఆ పదవి తమకే దక్కుతుందనే చాలామంది నేతలు ఆశించారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఇంతవరకు ఉమ్మడి జిల్లాలో ఈ కమిటీల ఊసే లేకుండా పోయింది. ప్లీనరీ నిర్వహణకు వారం రోజుల ముందే టీఆర్‌ఎస్‌ మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశాలిచ్చింది.


ఉమ్మడి జిల్లాలో కొన్ని మండలాల్లో ఇప్పటికీ కమిటీలను ఎన్నుకోలేదు. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య వర్గపోరుతో కమిటీ ప్రక్రియ కొలిక్కిరావడం లేదని తెలుస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో బోథ్‌ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యేల వర్గపోరు ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. దీంతోపాటు నియోజకవర్గ కమిటీల పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించడంతో ఆయా అసెంబ్లీ స్థానాల్లో గతంలో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారి చేతుల్లో కాకుండా ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చిన వారి చేతుల్లోకి నియోజకవర్గ బాధ్యతలు వెళ్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రాంతాల్లో వర్గపోరు బయటపడక తప్పదు.  



అయోమయంలో కార్యకర్తలు..

టీఆర్‌ఎస్‌లో గతంలో తూర్పు, పశ్చిమ జిల్లాల కమిటీ అధ్యక్షులు ఉండేవారు. పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా, కమిటీలు ఎన్నుకున్నా వీరి పాత్రే కీలకం. అలాంటిది ప్రస్తుతం ఆ కమిటీలను రద్దు చేయడం, ఇటు కొత్తగా నియోజకవర్గ కమిటీలు వేయకపోవడంతో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి, అయోమయం నెలకొంది. ఆయా మండలాల అధ్యక్షులు పార్టీ కార్యక్రమాలు వారి మండలాలకే పరిమితం అవుతున్నారు.



దీంతో జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు సీనియర్‌ నేతలు ఆసక్తి చూపకపోవడంతో పార్టీ వెనుకబడిపోతోందని పలువురు వాపోతున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుతో జోష్‌ మీద ఉన్న కార్యకర్తలు, వారిని వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు సంసిద్ధం చేయడానికి సరైన మార్గనిర్దేశకులు లేకుంటే పార్టీకి నష్టమనే చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు నియోజకవర్గ కమిటీలు ఎంతగానో ఉపయోపగపడుతాయి. కానీ జిల్లా కమిటీలను రద్దు చేసిన అధిష్టానం అదే స్థాయిలో నియోజకవర్గ కమిటీలను వేయడంలో వెనుకబడిపోయింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top