'నియంత పాలన చేస్తున్న కేసీఆర్'


- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి



ఆమనగల్లు (మహబూబ్ నగర్) : ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ఆరోపించారు. చెప్పేదొకటి, చేసేదొకటి.. అదే కేసీఆర్ నైజమని ఆయన అన్నారు. ఆమనగల్లు పట్టణంలో వివిద ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాటలకు, చేతలకు పొంతన లేదని ఆయన విమర్శించారు. ప్రజలకు పాలన సౌలభ్యం కోసం జిల్లాలను విభజిస్తున్నట్లు ప్రకటించిన సర్కార్ జిల్లాలను ఇష్టారీత్యా ఏర్పాటు చేసిందని ఆయన ఆరోపించారు.



కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గాన్ని ముక్కలు చెక్కలు చేసిందని ఆయనే అని విమర్శించారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపి ఈ ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిందని ఆయనేనని ఆరోపించారు. గతంలో 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న కల్వకుర్తిలో వివిద కార్యాలయాలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం కార్యాలయాలు అక్కడక్కడ ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఆమనగల్లు పట్టణంలో వెంటనే రెవెన్యూ డివిజన్ కార్యాలయం, ఎస్‌టీఓ, ఆర్టీఏ, సబ్ రిజిస్టార్, కోర్టులను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు తీరే వరకు బీజేపీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top