మహారాష్ట్రకు మన మద్యం

మహారాష్ట్రకు మన మద్యం - Sakshi


పొరుగు రాష్ట్రంలోని

 గడ్చిరోలిలో మద్య నిషేధం

 ఇక్కడి నుంచి లిక్కర్ అక్రమ రవాణా

 చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌శాఖ


 

 సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతం గుండా మద్యం అక్రమంగా మహా రాష్ట్రకు తరలుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో రెండేళ్లుగా మద్యనిషేధం అమల్లో ఉంది. దీంతో దొంగ చాటుగా లభిస్తున్న మద్యానికి అక్కడ డిమాండ్ ఎక్కు వగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అమ్మేందుకు అను మతించిన మద్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. తూర్పు అడవుల్లో గోదా వరి తీరం వెంబడి ఈ దందా యథేచ్ఛగా కొనసాగు తోంది. కాటారం, మహదేవపూర్‌లకు చెందిన కొందరు వ్యక్తులు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.

 

 బెల్ట్‌షాపుల పేరు చెప్పి..

 మహదేవపూర్ మండలంలో మూడు వైన్ షాపులు ఉన్నారుు. ఇందులో రెండు మహ దేవపూర్‌లో ఉండగా కాళేశ్వరంలో ఒక షాపు ఉంది. కాటారంలో మూడు వైన్‌షాపులు ఉన్నారుు. వీటికి అనుబంధంగా తూర్పు ఏజెన్సీలో వందల సంఖ్యలో బెల్టుషాపులు కొనసాగుతు న్నారుు. బెల్టుషాపులకు సరఫరా చేసే ముసుగులో మద్యాన్ని సరిహద్దు దాటిస్తున్నారు. గోదావరి తీరం వరకు చేరు కున్న మద్యాన్ని ఆటోలు, పడవల ద్వారా సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణ మద్యం మహారాష్ట్రలో రెట్టింపు ధర పలుకుతోంది. క్వార్టర్, హాఫ్, ఫుల్ ఇలా పరిమాణం ఏదైనా రేటు డబుల్‌గా ఉంటోంది. మహారాష్ట్రకు మద్యం తరలింపు ద్వారా లాభాలు అధికంగా ఉండటంతో క్రమంగా ఈ దందాలో పాల్గొనేవారి సంఖ్య పెరుగుతోంది.

 

 ఈ మార్గాల గుండా..

 మన రాష్ట్రంలో కాళేశ్వరం - మహారాష్ట్రలోని సిరొంచ మధ్య వంతెన నిర్మాణం పూర్త రుు్యంది. గతంలో పడవల ద్వారా తరలిన మద్యం గత మూడు నెలలుగా ఈ వంతెన మీదుగా ఆటోలు, వ్యాన్ల ద్వారా సిరొంచకు తరలుతోంది. కొన్ని సందర్భాల్లో మహా రాష్ట్రకు చెందిన వ్యక్తులు ఇక్కడి నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్తుండగా ఎక్కువగా ఇక్కడి వ్యక్తులే పకడ్బందీగా సరఫరా చేస్తున్నారు. మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ నుంచి గోదావరి నదికి అవతలి వైపు ఉన్న నడిగూడకు పడవల ద్వారా మద్యాన్ని సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వాహనాల ద్వారా మహారాష్ట్ర వైపు ఉన్న ఆసరెల్లి, అంకీస పట్టణా లకు మద్యాన్ని తరలిస్తున్నారు.   పలిమెల మండలం దమ్మూరు నుంచి పడవల మీదుగా గోదావరి దాటి ఛత్తీస్‌గఢ్ లోని భూపాలపట్నం పరిసర ప్రాంతాలకు ఇక్కడి మద్యం రవాణా అవుతోంది.

 

 నిద్రమత్తులో ఎకై ్సజ్ శాఖ..

 మన రాష్ట్రంలో అమ్మాల్సిన మద్యాన్ని అక్రమంగా పక్క రాష్ట్రంలో అమ్ముతుంటే అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు మిన్నకుండిపోతున్నారు. నిత్యం డీసీఎం, ప్యాసింజర్ ఆటోలు, పడవల ద్వారా రవాణా అవుతున్నా పట్టించుకోవడం లేదు. మద్యం తరలించే మార్గాల్లో ఎటువంటి తనిఖీలూ నిర్వహించడం లేదు. దీంతో మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూ వ్యాపా రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం మహా రాష్ట్రలో సిరొంచ, నగరం, కమలాపూర్, అంకీస, అసరెల్లి, నడిగూడ, చింతలపల్లి తదితర ప్రాంతాల్లో తెలంగాణ మద్యం చీకటి మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతోంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top