ఓటింగ్‌ విధానంపై అవగాహన ఉండాలి

ఓటింగ్‌ విధానంపై అవగాహన ఉండాలి


జేసీ శివలింగయ్య

నిర్మల్‌ టౌన్  : ఓటింగ్‌ విధానంపై విద్యార్థులకు అవగాహన ఉండాలని జేసీ శివలింగయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం డీఈవో కార్యాలయంలో నిర్మల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల విద్యార్థులకు ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్‌ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని పేర్కొన్నారు. మంచి పౌరులతోనే దేశం బాగుపడుతుందన్నారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువమంది యువత ఉన్న దేశం భారతదేశమేనని పేర్కొన్నారు.


ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఎంతో శక్తివంతమైనదని పేర్కొన్నారు. ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ప్రజలకు కలుగుతుందని తెలిపారు. యువత ఎన్నికలపై అవగాహన కలిగిఉండాలని అన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా రమేశ్‌బాబు, జిల్లా సైన్స్  అధికారి వినోద్‌కుమార్‌లు వ్యవహరించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు 21న నిర్వహించే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రణీత, తహసీల్దార్‌ రాజేశ్వర్, ఎంఈవో సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.



ఇసుక నిల్వలను పరిశీలించిన జేసీ  

నిర్మల్‌(మామడ) : మామడ మండలంలోని కమల్‌కోట్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదర్శనగర్‌ సమీపంలో నిల్వ చేసిన ఇసుకను బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ శివలింగయ్య పరిశీలించారు. గోదావరి నదిలో ఇసుక నిల్వలను పరిశీలించారు. గోదావరి నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారని ఫిర్యాదు అందడంతో ఇసుక నిల్వలను పరిశీలించి విచారణ చేపట్టారు.


అధికారుల బృందం పరిశీలించి వివరాలు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామన్నారు. ఇందులో భైంసా డీఎస్పీ అందె రాములు, సీఈ వెంకటేశ్వర్లు, ఈఈ రమణరెడ్డి, తహసీల్దార్‌ రామస్వామి, వీఆర్వో మోహన్   పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top