కీచక డ్రైవర్లు


నెల్లూరులో కొందరు ఆటోడ్రైవర్ల ముసుగులో కీచకులుగా మారుతున్నారు. పాఠశాలలకు వెళ్లి చదువుకునే, బతుకుదెరువు కోసం దుకాణాల్లో పని చేస్తూ ఒంటరిగా ఇంటికి వెళ్లే బాలికలపై కన్నేసిన దుర్మార్గులు వారిని నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి అత్యాచారాలకు తెగబడ్డారు. వారం క్రితం విద్యార్థినిపై ఓ డ్రైవర్‌ లైంగిక దాడికి యత్నిస్తే.. కోవూరుకు చెందిన గిరిజన బాలికపై మరో డ్రైవర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు.


గిరిజన బాలికపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం


కోవూరు : గిరిజన బాలికను బలవంతంగా సవక తోటలోకి తీసుకెళ్లి ఓ ఆటోడ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన మండలంలోని జమ్మిపాళెం వెళ్లే మార్గమధ్యంలో బుధవారం రాత్రి జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని స్టౌబీడీ కాలనీకి చెందిన ఓ బాలిక (16) నెల్లూరులోని పైపుల షాపులో పనిచేస్తుంది. ప్రతి రోజు షాపులో పని చేసుకుని రాత్రి ఇంటికి వస్తుంది. బుధవారం రాత్రి నెల్లూరులోని షాపు ఎదురుగా ఆటో కోసం నిరీక్షిస్తుండగా స్టౌబీడీ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ అహమ్మద్‌బాషా ఆటో ఆపి తాను ఇంటికి వెళ్తున్నానని ఎక్కించుకున్నాడు. ]


నేరుగా ఇంటికి వెళ్లకుండా మినీబైపాస్‌ మీదుగా జమ్మిపాళెం వెళ్లే మార్గంలోకి తీసుకెళ్లాడు. దీంతో బాలిక ప్రతిఘటించడంతో బలవంతంగా సమీపంలోని సవక తోటలోకి తీసుకెళ్లి నోట్లో గుడ్డ పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. వదిలి పెట్టాలని ఎంత బతిమలాడిన కొట్టి, అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. అతని నుంచి తప్పించుకుని రోడ్డుపైకి చేరుకుని ఉండగా అహమ్మద్‌ బాషా వచ్చి ఆటోలో మీ ఇంటి దగ్గర వదిలిపెడతానని జరిగిన విషయం ఎవరికి చెప్పొద్దని, చెబితే  చంపేస్తానని బెదిరించాడు. ఆటోలో ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లాడు. ఆలస్యంగా ఇంటికి చేరిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు.

బాలికపై లైంగిక దాడికి యత్నం


ఆటో డ్రైవర్‌ అరెస్ట్‌


నెల్లూరు (క్రైమ్‌): ఓ దళిత బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్‌–2 డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎన్‌. సుధాకర్‌ నిందితుడి వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్‌ మండలానికి చెందిన దళిత బాలిక నగరంలోని హైసూ్కల్‌లో 8వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఇంతియాజ్‌ ఆటోడ్రైవర్‌. అతనిలో ఆటోలో తరచూ బాలిక స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చేది. బాలికపై కన్నేసిన ఇంతియాజ్‌ ఈ నెల 7వ తేదీన బా«లిక స్కూల్‌ నుంచి ఇంటికి నడచుకుంటూ బయలుదేరింది.


ఆమెను వెంబడించిన ఇంతియాజ్‌ బలవంతంగా ఆమెను ఆటోలో ఎక్కించుకుని నగరశివారు ప్రాంతంలోని తుమ్మచెట్ల వద్దకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించగా బాలిక అతని నుంచి తప్పించుకుని పారిపోయింది. దీంతో బాలిక జరిగిన విషయాన్ని తన తాతకు చెప్పడంతో ఈ నెల 9న నెల్లూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఫోక్సాయాక్ట్‌  కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్సీ, ఎస్టీ సెల్‌–2 ఎస్పీకి బదలాయించారు.


విచారణ నిర్వహించి నిందితుడు ఇంతియాజ్‌ గురువారం గాంధీనగర్‌ సెంటర్‌ డైకస్‌రోడ్డు వద్ద ఉండగా తన సిబ్బందితో కలసి అరెస్ట్‌ చేశామని డీఎస్పీ సుధాకర్‌ చెప్పారు. ఈ సమావేశంలో ఏఎస్‌ఐ నాయబ్‌రసూల్, హెడ్‌కానిస్టేబుల్‌ మధుబాబు, కానిస్టేబుల్స్‌ వై. శ్రీనివాసులు, యు. చక్రవర్తి, జి. కిశోర్‌కుమార్‌  పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top